ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల పరీక్షలు రద్దు.. పరీక్షల్లేకుండా డిగ్రీ త్వరలో..

  • Published By: vamsi ,Published On : July 11, 2020 / 02:21 PM IST
ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల పరీక్షలు రద్దు.. పరీక్షల్లేకుండా డిగ్రీ త్వరలో..

కరోనా వైరస్ వినాశనం దృష్ట్యా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పరీక్షలను రద్దు చేసింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ ఢిల్లీ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల రాబోయే పరీక్ష రద్దు చేసినట్లు ప్రకటించారు. వచ్చే సెమిస్టర్‌లో పిల్లలందరికీ పదోన్నతి లభించినట్లు చెప్పారు.

పరీక్షను రద్దు చేసి, విద్యార్థుల మూల్యాంకనం కోసం ఒక స్కేల్‌ను సిద్ధం చేయడం ద్వారా వీలైనంత త్వరగా డిగ్రీ ఇవ్వాలని అన్ని విశ్వవిద్యాలయాలను కోరినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కరోనా కారణంగా, పరీక్షలు రాయడం కుదరదని. రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ పరిధిలోకి వచ్చే అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా దేశంలోని ఇతర కేంద్ర విశ్వవిద్యాలయాలలో కూడా ఢిల్లీ ప్రభుత్వం లాంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.

ఢిల్లీలో లక్ష మందికి పైగా కరోనా రోగులు:
భారతదేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో, దేశ రాజధాని ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 9వేల 140 ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి. కరోనా సోకినవారిలో 3,300 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 21,146 మంది సోకిన రోగులు చికిత్స పొందుతున్నారు.

Read Here>>టిక్-టాక్ నిషేధం నిర్ణయంపై అమెజాన్ వెనకడుగు