అనురాగ్ ఠాగూర్ పూజలు..ఎర్రసంచితో వచ్చిన నిర్మల

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 04:27 AM IST
అనురాగ్ ఠాగూర్ పూజలు..ఎర్రసంచితో వచ్చిన నిర్మల

కేంద్ర ప్రభుత్వం 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా…రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి మంత్రులు నిర్మలా..అనురాగ్ ఠాగూర్ చేరుకున్నారు. ఎర్రటి సంచిలో బడ్జెట్ పత్రాలతో నిర్మలా వచ్చారు. అంతకంటే ముందు..అనురాగ్..తన సొంత నివాసంలో పూజలు చేశారు. 
 

ఇక బడ్జెట్‌పై అందరి చూపు నెలకొంది. ప్రజలతో పాటు కంపెనీలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు 5లక్షలకోట్ల డాలర్ల ఎకానమీ టార్గెట్…మరోవైపు జిడిపి నేలచూపులు…ఇలాంటి సిచ్యుయేషన్ మధ్య కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌కి..వాస్తవ పరిస్థితికి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది.

Read More : బయటపడిన రోజా ఆడియో : ఆ కార్యక్రమాలకు వెళ్లను..పార్టీకి దూరం పెడుతా

వరుసగా ప్యాకేజీల ప్రకటన ఏ మాత్రం ఫలితం ఇవ్వకపోవడంతో ఇక కేంద్ర బడ్జెట్‌లో ఏవో అద్భుతాలు ఉంటాయనుకోవద్దనే వారూ ఉన్నారు..అయితే..గ్రోత్ నంబర్లు నిరాశ పరచడంతో వెంటనే కేంద్రం కార్పోరేట్ ట్యాక్స్ కట్ చేయడం మంచి చర్యగా ఇండస్ట్రీ భావించింది. నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఓ సిక్స్ పాయింట్ ఫార్ములానే అనుసరించే అవకాశాలున్నాయంటున్నారు..