All Party Meeting : దేశంలో 10 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాన్న కేంద్రం!

శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది.

All Party Meeting : దేశంలో 10 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాన్న కేంద్రం!

All Party Meeting In Delhi

All Party Meeting :  శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో    ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర పరిస్థితికి చేరాయని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ అధికారులు సమావేశంలో వివరించారు.  దేశంలో పది రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఉన్నాయని అధికారులు అఖిల పక్షానికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీలంక తరహా పరిస్థితి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో తలేత్తే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.

కాగా… ఆర్బీఐ, కాగ్ నివేదికల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అధికారులను ప్రశ్నించగా…  ఆర్బీఐ, కాగ్ నివేదికలు చెప్పిన పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని.. వీటికి కేంద్రం  నుంచి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు అధికారులు సమాధానం చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ జీడీపీ లో 32 శాతం అప్పులు ఉన్నాయని ఆర్బీఐ, కాగ్ లు నివేదించాయి.

వీటిలో బడ్జెటేతర అప్పులు, కమిటెడ్  ఎక్స్‌పెండిచర్, జెన్ కో లకు మితిమీరిన బాకీలు, స్థాయికి మించిన ప్రభుత్వ హామీలు… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారటానికి కారణాలుగా కేంద్ర అధికారులు వివరించారు. వీటిని  కేంద్ర ఆర్ధిక శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని… తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు అఖిల పక్షానికి తెలిపారు.

తెలంగాణ అప్పుల ప్రస్తావన రాగానే టీఆర్ఎస్ ఎంపీలు అధికారులకు అడ్డు  తగిలారు. తమ రాష్ట్రం నిబంధనల ప్రకారమే అప్పులు తీసుకుంటుందని అన్న టీఆర్ఎస్ ఎంపీలు…. శ్రీలంక దేశం పరిస్థితిని వివరిస్తూ మన దేశంలో రాష్ట్రాలను ఎందుకు ప్రస్థావిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రాల సంగతి కాదు…ముందు దేశ అప్పుల సంగతి చెప్పండి అని అన్న వైసీపీ ఎంపీలు కేంద్ర అధికారులను ప్రశ్నించారు.  శ్రీలంక ప్రస్తుత పరిస్థితి కి కారణం… రాజకీయ కుదుపులు, ఆర్ధిక సంక్షోభం, తలకు మించి చేసిన అప్పులు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం అని వివరించిన విదేశాంగ, ఆర్ధిక శాఖల అధికారులు వివరించారు.

Also Read : Haryana : డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్ట్.. ఎన్‌కౌంటర్‌లో దిగిన బుల్లెట్