ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2019 / 08:00 AM IST
ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ :  పాక్ పై యుద్ధ‌మేనా

ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-16,2019) ఉద‌యం 11గంట‌ల‌కు ప్రారంభ‌మైన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబ, కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, బీఎస్పీ నేత సతీశ్‌ చంద్ర మిశ్రా, ఎల్‌జేపీ నేత రాంవిలాస్‌ పాసవాన్‌, సీపీఎం, సీపీఐ నేతలు హాజరయ్యారు. టీడీపీ తరఫున ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీఆర్ఎస్ నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డి  పాల్గొన్నారు.

ఉగ్రదాడికి సంబంధించిన సమాచారాన్ని, ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకున్న చర్యల్ని ఈ భేటీలో ప్రభుత్వం వివరించింది. యాక్ష‌న్ ప్లాన్ ను స‌మావేశంలో విప‌క్షాలకు కేంద్ర‌హోంమంత్రి రాజ్ నాథ్ వివ‌రించారు. ఉగ్ర‌వాదాన్ని అంత‌మొందించేందుకు అన్ని  పార్టీలు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ముక్తకంఠంతో పుల్వామా ఉగ్ర‌దాడిని ఖండించాయి. పుల్వామా ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ స‌మావేశంలో ఓ తీర్మానాన్ని పాస్ చేశారు. 

అఖిల‌ప‌క్ష భేటీ అనంత‌రం కాంగ్రెస్ నేత గులాంన‌బీ ఆజాద్ మాట్లాడుతూ.. త‌మ త‌ర‌పున అన్ని దేశీయ‌,ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ప్ర‌ధాని మీటింగ్ ఏర్పాటు చేసేలా ప్ర‌ధానిని రిక్వెస్ట్ చేయాల‌ని త‌మ త‌ర‌పున హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కోరామ‌ని తెలిపారు. దీనికి ఇత‌ర పార్టీలు కూడా మద్ద‌తిచ్చాయ‌ని తెలిపారు. దేశం మొత్తం ఈ రోజు ఉగ్ర‌దాడిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న కోపంతో ఉంద‌ని అన్నారు. తాము  జ‌వాన్ల‌కు అండ‌గా నిల‌బ‌డ్డామ‌ని, మొత్తం దేశం జ‌వాన్ల‌కు అండ‌గా నిల‌బ‌డింద‌ని ఆజాద్ అన్నారు. 1947నుంచి మొట్ట‌మొద‌టిసారి ఇంత‌పెద్ద సంఖ్య‌లో ఓ దాడిలో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

Read Also :  పాక్ పత్రికల్లో పిచ్చి రాతలు : పుల్వామా దాడి స్వాతంత్య్ర పోరాటమంట

Read Also :  సాలే, ఇక్కడెందుకున్నావ్ రా? పాకిస్థాన్‌కి పో..