Hijab Row: కర్ణాటకలో స్కూళ్లు, కాలేజీలకు 3 రోజులు సెలవులు.. శాంతి, సామరస్యంతో ఉండాలన్న సీఎం బొమ్మై

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్కూల్స్, కాలేజీలు అన్నింటినీ మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా మూడు రోజులు శాంతి, సామరస్యం పాటించాలని కోరారు.

Hijab Row: కర్ణాటకలో స్కూళ్లు, కాలేజీలకు 3 రోజులు సెలవులు.. శాంతి, సామరస్యంతో ఉండాలన్న సీఎం బొమ్మై

Basavaraj Bomai

Hijab Row: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్కూల్స్, కాలేజీలు అన్నింటినీ మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా మూడు రోజులు శాంతి, సామరస్యం పాటించాలని కోరారు.

‘స్టూడెంట్లను, టీచర్లను, స్కూల్స్, కాలేజ్‌స్ మేనేజ్మెంట్ ను ఇదే కోరుతున్నా. కర్ణాటకలో శాంతి, సామరస్యంగా ఉండాలని చెబుతున్నా. అందుకే మరో మూడ్రోజుల పాటు హైస్కూల్స్, కాలేజెస్ ను మూసేయాలని ఆదేశించా. దీనికి అందరూ కోపరేట్ చేయాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు కర్ణాటక సీఎం.

ఉడుపిలో ఉన్న గవర్నమెంట్ కాలేజీ విద్యార్థినులు ఐదుగురు కర్ణాటక హై కోర్టులో హిజాబ్ నిబంధనలను ప్రశ్నిస్తూ పిటిషన్ వేశారు. ఈ విచారణ మంగళవారం, బుధవారం కూడా జరగాల్సి ఉంది. ఈ మేరకు కోర్టు కూడా స్టూడెంట్లు, పబ్లిక్ అంతా శాంతి వహించాలని పిలుపునిచ్చింది.

Read Also: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

 

కోర్టు విచారణ ముగియడానికి ముందు సీఎం కూడా ట్వీట్ చేసి అదే విషయాన్ని వెల్లడిస్తూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరారు.

గత నెల ఉడుపిలో ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ పీయూ కాలేజీలో హిజాబ్ ఆందోళనలు మొదలయ్యాయి. ఆరుగురు స్టూడెంట్స్ హెడ్ స్కార్ఫ్ కట్టుకుని వస్తుండగా అడ్డుకున్నందుకు వివాదం మొదలైంది. ఉడుపి, చిక్కమాగలూరులోని రైట్ వింగ్ గ్రూప్స్ ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి క్లాసుల్లోకి రావడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

శుక్రవారం, శనివారం కొందరు స్టూడెంట్లు కాషాయం కండువాలు కప్పుకుని కాలేజీకి వచ్చారు. మంగళవారం ఇరు గ్రూపులు పరస్పరం రాళ్లు విసురుకున్నారు.