Allahabad HC : వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేయటం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకం

Allahabad HC : వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేయటం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకం

Allahabad Hc

Allahabad HC : సహ జీవనం అనేది భారత్ పెరుగుతోంది. ఒకరిరంటే మరొకరు ఇష్టపడి వివాహం కాకుండానే కలిసి భార్యాభర్తల్లా ఉండటం వారి వారి ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే..వివాహం అయి భర్తను వదిలేసి మరో వ్యక్తితో కలిసి ఉండటం అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పిటీషన్ వేసిన మహిళకు..ఆమె ప్రియుడికి రూ.5,000 జరిమానా కూడా విధించింది.

నేను ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నాను…దానికి నా భర్త అడ్డు వస్తున్నాడు..అతని నుంచి గానీ అతని బంధువుల తరపునుంచి గానీ నాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలంటూ ఓ మహిళ..ఆమె ప్రియుడు అలహాబాదు హైకోర్టును కోరారు. ఈ పిటీషన్ కోర్టు తీవ్రంగా స్పందించింది. సదరు పిటీషనర్ వివాహిత..ఆమె భర్తను వదిలేసి మరో వ్యక్తితో కలిసి ఉంటం అనేది ‘వివాహేతర సహజీవనం’ ఇటువంటి సహజీవనాన్ని కోర్టు అనుమతించబోదు అని కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య, ఆమె ప్రియుడు స్వేచ్ఛ చట్టానికి లోబడి ఉండాలి తప్ప ఇటువంటి వివాహేతర సహజీవనం సరికాదని..ఇది హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకం‘ అని వ్యాఖ్యానించింది. ధర్మాసనం పిటిషనర్లకు 5 వేల జరిమానా విధించింది.

ఓ వివాహిత ఓ వ్యక్తిని ఇష్టపడింది.దీంతో ఆమె భర్తను వదిలేసి ఇష్టపడిన వ్యక్తితో కలిసి (సమజీవనం) ఉంటోంది. ఈక్రమంలో ‘సహజీవనం చేస్తున్న తమపై భర్త..అతని కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ.. సదరు మహిళ ఆమె ప్రియుడు అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ..‘తమ సహజీవనం ప్రశాంతంగా సాగుతోందని..చాలా సంతోషంగా ఉన్నామని. అటువంటి మా జీవితంలో భర్త గానీ, ఇతరులు కానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని ఓ వివాహిత, ఆమె ప్రియుడు కోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ‘‘ఓ వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకం అది సహజీవనం అనిపించుకోదు..రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ చట్టానికి లోబడి ఉండాలి’ అంటూ జస్టిస్ కౌశల్ జయేంద్ర ఠాకెర్, జస్టిస్ దినేశ్ పాఠక్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టవ్యతిరేకంగా ఉంటే ఇటువంటి పిటిషన్‌లను ధర్మాసనం అంగీకరించదని స్పష్టంచేసింది. భర్త నుంచి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటే తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని సదరు పిటీషన్ దారులకు కోర్టు సూచించింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ పేరుతో వివాహేతర సహజీవనానికి అంగీకరించబోమని తేల్చి చెప్పింది అలహాబాద్ హైకోర్టు.