నచ్చినవారితో కలిసి జీవించే హక్కు యువతకు ఉంది : అలహాబాద్ హైకోర్టు

  • Published By: nagamani ,Published On : November 3, 2020 / 02:02 PM IST
నచ్చినవారితో కలిసి జీవించే హక్కు యువతకు ఉంది : అలహాబాద్ హైకోర్టు

Allahabad : యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు వారికి ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మతాంతర వివాహం చేసుకున్న ఓజంట వేసిన పిటీషన్ పై చేపట్టిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్‌లు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ వారిని అమ్మాయి తల్లిదండ్రులు వారిద్దరినీ వెతికి వెతికి పట్టుకున్నారు. వారిద్దరినీ తీసుకొచ్చి ఓ గదిలో వేసి తాళం వేసి నిర్బంధించారు.


కానీ వారిద్దరీ వేరుచేస్తారనే భయంతో తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ‘‘మా ఇద్దరి మతాలు వేరు అయినంత మాత్రాన మేం వివాహం చేసుకోకూడదా? కలిసి జీవించకూడదా? దయచేసి మాకు న్యాయం చేయండి..మేం ఇద్దరం మేజర్లం.. తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.


ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వేరే దారిలేక అమ్మాయి తల్లిదండ్రులు వారిని కోర్టుకు తీసుకెళ్లక తప్పలేదు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని..నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు ఉందని స్పష్టం చేసింది.



దీంతో అలియాస్ జోయా, షావెజ్‌లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.తమకు కలిసి జీవిస్తామనీ దయచేసి మమ్మల్ని వేరు చేయవద్దని తమ తల్లిదండ్రులన కోరారు. న్యాయస్థానం తీర్పు ప్రకారం మాకు ఆ హక్కు ఉందని గుర్తు చేశారు.