సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు : కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 10:51 AM IST
సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు : కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

ఢిల్లీ : సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అంతర్గత విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన కమిటీ నుంచి తప్పుకున్నారు. మహిళా ఉద్యోగి ఆరోపణలకు సంబంధించి ఏప్రిల్ 23న ముగ్గురు న్యాయమూర్తులతో అంతర్గత విచారణ కమటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. 

సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవ్ బెయిన్స్ అఫిడివిట్ లోని ఆరోపణలపై రిటైర్డ్ జడ్జి పట్నాయక్ నేతృత్వంలో దర్యాప్తుకు ఆదేశించింది. ఏకే పట్నాయక్ కు సీబీఐ డైరెక్టర్, ఐబీ చీఫ్, ఢిల్లీ పోలీసులు సహకరించాలని సూచించింది. ఏకే పట్నాయక్ తన నివేదికను సీల్డ్ కవర్ లో అందజేయాలని తెలిపింది.
సీజేఐపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల కుట్ర కోణం వెనుక ఎవరెవరూ దాగి ఉన్నారు. న్యాయ వ్యవస్థను విఛిన్నం చేసేందుకు శక్తులు ఎందుకు పని చేస్తున్నాయని ఉత్సవ్ బెయిన్స్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై రిటైర్డ్ జడ్జి ఏకే పట్నాయక్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవ్ బెయిన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ కు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ఎవరు కూడా ధన ప్రభావం, రాజకీయ ప్రభావంతో సుప్రీంకోర్టును నడపలేరు. ఇది అత్యున్నత స్థాయి న్యాయ వ్యవస్థ, ఎవరి ప్రభావానికి సుప్రీంకోర్టు లొంగిపోదనే అంశాలను అరుణ్ మిశ్రా స్పష్టం చేశారు.

భారత ఆధారాల చట్టం సెక్షన్ 126 ప్రకారం ఉత్సవ్ బెయిన్స్ దాఖలు చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కేకే.వేణుగోపాల్ వాదనాలు వినిపించారు. ఉత్సవ్ బెయిన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ పై సిట్ తో దర్యాప్తు జరపాలని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని అడిషనల్ సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తుషార్ మెహతా సూచించారు. ఆరోపణలు చేసిన మహిళకు సంబంధించిన వాదనలను ఈ బెంచ్ సమాంతరంగా వినాలని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జయ్ సంగ్ వాదనలు వినిపించారు. 
అన్ని వాదనాలు విన్న తర్వాత జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ రోహింగ్టన్ కుల్ నారిమన్ తో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు విడుదల చేసింది. మహిళ చేసిన ఆరోపణలపై విచారణకు ఒక కమిటీని వేశారు. సంబంధిత మహిళను గురువారం (ఏప్రిల్ 26, 2019) న సుప్రీంకోర్టుకు రావాలని ఆదేశించారు. 

మహిళ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగిగా సుప్రీంకోర్టులో పని చేశారు. 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్ల పాటు పని చేశారు. అక్టోబర్ 2018 న రంజన్ గొగోయ్ తనను వేధించారని ఇటీవలే 24 మంది న్యాయమూర్తులకు లేఖ రాశారు. దీనికి సంబంధించి అంతర్గత కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. మహిళ ఆరోపణలకు సంబంధించి జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కమిటీ వేశారు. కమిటీ నుంచి ఎన్వీ రమణ వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. కమిటీలో మహిళకు అవకాశం ఇవ్వాలని…తన వాణిని వినిపించుకునేందుకు అడ్వకేట్ కు అవకాశం కల్పించాలని చెబుతోంది. నిజంగా లైంగిక ఆరోపణలు నిజమేనా, కుట్రనా అన్న కోణలో దర్యాప్తు జరుగబోతుంది.