KTR : బడ్జెట్‌లో భారీగా నిధులివ్వండి.. నిర్మలా సీతారామన్‌కి కేటీఆర్ లేఖ

తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి..

KTR : బడ్జెట్‌లో భారీగా నిధులివ్వండి.. నిర్మలా సీతారామన్‌కి కేటీఆర్ లేఖ

Ktr

KTR : తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ”నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలి. ఇండస్ట్రియల్ కారిడార్ లకు నిధులు ఇవ్వాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్ లను గుర్తించింది.

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్ లలో ఒక్కో దానికి రూ.1500 కోట్లు కనీసంగా రానున్న బడ్జెట్లో కేటాయించాలి. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ లో హైదరాబాద్ ను చేర్చాలి. డిఫెన్స్, ఏరో స్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి. రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను చేర్చాలి. హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని” లేఖలో కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్‌ఫుల్! – ఐఐటీ నిపుణులు

అలాగే మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు కేటాయించాలని కేటీఆర్ కోరారు. రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి ఎక్స్ టర్నల్ మౌలిక వసతుల కోసం రూ.1,399 కోట్లు కేటాయించాలన్నారు. అంతర్గత మౌలిక వసతుల కోసం మరో రూ.3వేల 554 కోట్లు.. మొత్తంగా హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ.5వేల 003 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని కోరారు కేటీఆర్. బడ్జెట్‌ 2022 తయారీ చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వానికి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.