Covishield : 4 వారాలకే కొవిషీల్డ్ సెకండ్ డోస్.. కేరళ హైకోర్టు కీలక ఆదేశం

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Covishield : 4 వారాలకే కొవిషీల్డ్ సెకండ్ డోస్.. కేరళ హైకోర్టు కీలక ఆదేశం

Covishield

Covishield : ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి తగ్గింపును ఇప్పటికే పరిశీలిస్తున్నామని.. వీటిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) నిపుణులతో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తాజాగా కోవిషీల్డ్‌ రెండు డోసుల వ్యవధి తగ్గింపుపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండో డోస్ 4 వారాలకే వేసుకునే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కరోనా వ్యాక్సిన్ పాత ప్రొటొకాల్‌ ప్రకారం కోవిషీల్డ్‌ తొలి టీకా తీసుకున్నవారిలో ఎవరైనా 4 వారాలకే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే అందుకు వారికి అనుమతించాలని కేరళ హైకోర్టు సూచించింది. వ్యాక్సిన్ ప్రొటోకాల్ లో ఈ మేరకు రెండో టీకాను షెడ్యూల్‌ చేయాలని తెలిపింది.

Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..

పాత ప్రొటొకాల్‌ ప్రకారం నాలుగు వారాలకే రెండో టీకా తీసుకునే అవకాశం ఉండగా.. దాన్ని సవరించి రెండో డోసు టీకా గడువును 84 రోజులకు పొడిగించారు. అయితే విదేశాలకు వెళ్లే వారికి తొందరగా రెండో టీకా వేసుకునేందుకు నిబంధన సడలించారు. దేశంలో ఉన్నవారు మాత్రం తొందరగా రెండో డోస్ టీకా తీసుకుని సురక్షితంగా ఉండాలని భావిస్తుంటే.. ఎందుకు అనుమతివ్వడం లేదని జస్టిస్ పి.బి సురేష్ కుమార్ ప్రశ్నించారు.

కైటెక్స్‌ గార్మెంట్స్‌ కంపెనీ వేసిన పిటీషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. తన కార్మికులకు 84 రోజులు కాకుండా తొలి ప్రొటొకాల్‌ ప్రకారం 4 వారాలకే టీకా వేసుకునేలా అనుమతించాలని కైటెక్స్ గార్మెంట్ కంపెనీ అభ్యర్థనను మన్నించాలని.. ఈ మేరకు కోవిన్‌ యాప్‌లో మార్పు చేయాలని కేరళ హైకోర్టు సూచించింది.

Rs 800 KG Bhindi : ఈ బెండ‌కాయ‌లు కిలో రూ.800.. ఎందుకంత కాస్ట్లీ అంటే

కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. మన దేశంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన వాళ్లకు ఉచితంగా మూడు కరోనా నిరోధక టీకాలు ఇస్తున్నారు. కోవిషిల్డ్ (కోవిషీల్డ్), కోవాక్సిన్ (కోవాక్సిన్), రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V టీకాలను ఉపయోగిస్తున్నారు. మరికొన్ని టీకాలు వివిధ దశల పరీక్షలో ఉన్నాయి. మూడు టీకాల మొదటి, రెండవ మోతాదుల మధ్య వ్యత్యాసం భిన్నంగా ఉంటుంది.

అయితే కోవిషిల్డ్ రెండు డోసుల మధ్య చాలా గ్యాప్ ఉంది. ప్రస్తుతం రెండు డోసుల కోవిషీల్డ్ 84 రోజుల వ్యవధిలో ఇస్తున్నారు. ఇంతకు ముందు ఈ గ్యాప్ తక్కువగా ఉండేది. కానీ ప్రభుత్వం దానిని పెంచింది. దీంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండవ మోతాదుల మధ్య 84 రోజుల విరామం ఎందుకు ఉంచారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండవ డోసుల మధ్య 84 రోజుల వ్యవధి ఇవ్వడం వల్ల కోవిడ్-19 నుంచి ఎఫెక్టివ్ గా రక్షణ అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు తెలిపింది. కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ రిట్‌కు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని తెలిపింది.