కరోనా జాగ్రత్తలతో ఎక్కువ ఆర్ధిక కార్యకలాపాలకు అనుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 13, 2020 / 06:00 AM IST
కరోనా జాగ్రత్తలతో ఎక్కువ ఆర్ధిక కార్యకలాపాలకు అనుమతి

లాక్ డౌన్ పొడిగింపు సమయాల్లో కూడా సమంజసమైన రక్షణలతో(RESONABLE SAFEGUARDS)ఎక్కువ పరిశ్రమల కార్యకలాపాలను అనుమతించాలని వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సూచించింది. హోంమంత్రిత్వశాఖను ఉద్దేశించి రాసిన లేఖలో…ఆటో,టెక్స్ టైల్,ఢిఫెన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర కొన్ని సెక్టార్లలో కొంత మ్యానుఫ్యాక్చర్ ను రీసార్ట్ చేయాలని వాణిజ్యశాఖ రికమండ్ చేసింది.

లాక్ డౌన్ పొడిగింపు విషయమై మరియు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ స్థితి గురించి ఫైనల్ నిర్ణయం వెలువడిన తర్వాత కొన్ని ఎక్కువ కార్యకలాపాలను అనుమతించాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆ లేఖలో వాణిజ్యశాఖ తెలిపింది. వివిధ రాష్ట్రాలు మరియు పరిశ్రమల బాడీలతో వాణిజ్యశాఖ మాట్లాడిన దాని ఆధారంగా లాక్ డౌన్ నుంచి ఎగ్జిట్ ఫ్లాన్ రికమండ్ చేయబడిందని తెలిపారు.

సోషల్ డిస్టెన్స్,శానిటైజేషన్ మరియు స్పేసింగ్ ను ఈ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు. తక్కువమంది సిబ్బందితో షిఫ్ట్ లను తగ్గించి సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)ను పాటించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వాణిజ్యశాఖ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికనష్టాన్ని సరిచేయడానికి మరియు ప్రజల చేతుల్లో నగదు ఉండేందుకు మరిన్ని కార్యకలాపాలు అవసరమని వాణిజ్యశాఖ తెలిపింది.

మార్చి నెలలో భారత ప్రధానమంత్రి ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ రేపటితో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపుపై ఇవాళ ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే అవకాశముంది. లాక్ డౌన్ పొడిగింపుకే ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏప్రిల్-11న జరిగిన వీడియోకాన్షరెన్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా మోడీకి లాక్ డౌన్ పొడిగించాలని సూచించారు.

అయితే దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉంటే ఆ ప్రాంతాలను ఆరెంజ్ జోన్ గా, 15 కేసుల కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా,వైరస్ ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్ పరిధిలోకి కరోనా ప్రభావం లేని 400 జిల్లాలు రానున్నాయి. ఈ 400 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు. జోన్ల వారిగా దేశంలో లాక్ డౌన్ పై మార్గదర్శకాలు ఉండనున్నట్లు సమాచారం.  గ్రీన్,ఆరెంజ్ జోన్లలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరిమిత స్థాయిలో ప్రారంభించడం,వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుమతించనున్నారు.