ప్రతి ఐదుగురు కరోనా పేషెంట్లలో ఒకరికి ఇదే లక్షణం

ప్రతి ఐదుగురు కరోనా పేషెంట్లలో ఒకరికి ఇదే లక్షణం

COVID-19: ప్రతి ఐదుగురు కరోనా పేషెంట్లలో ఒకరికి కనిపించిన ప్రధాన లక్షణం గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యే. వికారంగా ఉండటం, వాంతులు, విరేచనాలు వంటివి మాత్రమే కనిపించాయని స్టడీలు చెబుతున్నాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలతో పాటు కొవిడ్-19కు సంబంధం ఉంటుందని ఫలితంగానే వికారంగా ఉండడం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటివి వస్తాయని అంటున్నారు.




అబ్డామనినల్ రేడియాలజీ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. 18శాతం మంది పేషెంట్లలో అలాంటి లక్షణాలే కనిపించాయి. 16శాతం శాతం మందిలో కొవిడ్ కేసుల్లో అదే సమస్య వస్తుందట.
https://10tv.in/second-wave-of-covid-could-mask-out-festivals-experts/
‘కొవిడ్ 19కు సాధారణ లక్షణంగా కనిపించేస్థాయికి కడుపులో నొప్పి చేరిపోతుందని కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ క్లినికల్ లెక్చరర్ మిచ్ విల్సన్ అంటున్నారు. జులై 15నుంచి జరిపిన 36 స్టడీల్లో రీసెర్చర్స్ ఈ విషయాలు కనుగొన్నారు. అటువంటి పరిస్థితుల్లో కొవిడ్19 ఇన్ఫెక్షన్ కనుగొనేందుకు స్కానింగ్ చేయించుకోవాలని చెబుతున్నారు.




చిన్న పేగులు, పెద్ద పేగుల్లో మంటలతో పాటు విరేచనాలు కూడా అవుతాయి. కొద్ది మందిలో మాత్రమే ఇవి కనిపిస్తుంటాయి. ‘కేవలం ఈ లక్షణాలతో మాత్రమే పేషెంట్ కొవిడ్ పాజిటివ్ అని కన్ఫామ్ చేయలేం. ఇలా కావడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు’ అని విల్సన్ అన్నారు.

ఈ సమస్యలు రావడానికి కారణాల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి అయి ఉండొచ్చు. కొవిడ్ 19 వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు అంటున్నారు.