National Highways: 9 ఏళ్లలో 50,000 కి.మీ. జాతీయ రహదారులు పెరిగాయట

ఇక 2014-15 కాలంలో రోజు 12.1 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగేదని, అయితే ప్రస్తుతం అది 28.6 కిలోమీటర్లకు చేరిందని అన్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధి కూడా పెరుగుతుందని అన్నారు

National Highways: 9 ఏళ్లలో 50,000 కి.మీ. జాతీయ రహదారులు పెరిగాయట

National Highways: నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది ఏళ్ల నుంచి దేశంలో 50,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు పెరిగాయని కేంద్రం ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. మౌలిక సదుపాయాల రంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమంగా పని చేస్తోందని, వాటి ఫలితమే ఇదని ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. 2014-15 మధ్యలో దేశంలో 97,830 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండేవని, అయితే 2023 మార్చి నాటికి 145,155 కిలోమీటర్లకు జాతీయ రహదారులు పెరిగాయని పేర్కొన్నారు.

Amritpal Singh: అమృతపాల్ సింగ్ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ 6 ప్రశ్నలు

ఇక 2014-15 కాలంలో రోజు 12.1 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగేదని, అయితే ప్రస్తుతం అది 28.6 కిలోమీటర్లకు చేరిందని అన్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధి కూడా పెరుగుతుందని అన్నారు. జీవన మౌలిక సదుపాయాలు పెరగడమే కాకుండా రక్షణ వ్యవస్థ కూడా పటిష్టమవుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం 85 శాతం ప్రయాణీకులతో పాటు 70 శాతం వస్తువుల రవాణా రోడ్ల ద్వారానే కొనసాగుతోందని, ఇది రోడ్డు వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియజేస్తోందని అన్నారు.

Telangana Politics: బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్.. పొన్నం ప్రభాకర్

ప్రస్తుతం దేశంలో 63.73 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ప్రపంచంలో ఇది రెండవ అతిపెద్ద రోడ్డు వ్యవస్థ. ఇందులో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరకు రవాణా, ప్రయాణీకుల సమర్ధవంతమైన రవాణాను విస్తృతం చేయడం, దాన్ని ప్రజలను అనుసంధానించడం, ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో జాతీయ రహదారులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. దేశంలో జాతీయ రహదారి మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు. 2014-15 నుంచి 2021-22 మధ్య కారిడార్ ఆధారిత జాతీయ రహదారి అభివృద్ధి విధానం ద్వారా క్రమబద్ధమైన ప్రోత్సాహం కారణంగా జాతీయ రహదారుల నిర్మాణ వేగం స్థిరంగా పెరిగిందని అన్నారు.