Alwar temple demolish: ఆ గుళ్ళు మళ్లీ కడతాం: అళ్వార్ జిల్లా అధికారులు

ఇటీవల రాజస్తాన్‌లోని అళ్వార్ జిల్లా, రాజ్‌ఘర్‌లో దురాక్రమణల కూల్చివేతలో ధ్వంసమైన గుడులను తిరిగి నిర్మిస్తామని ప్రకటించింది జిల్లా యంత్రాంగం. రాజ్‌ఘర్‌లో గత ఆది, సోమ వారాల్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

Alwar temple demolish: ఆ గుళ్ళు మళ్లీ కడతాం: అళ్వార్ జిల్లా అధికారులు

Alwar

Alwar temple demolish: ఇటీవల రాజస్తాన్‌లోని అళ్వార్ జిల్లా, రాజ్‌ఘర్‌లో దురాక్రమణల కూల్చివేతలో ధ్వంసమైన గుడులను తిరిగి నిర్మిస్తామని ప్రకటించింది జిల్లా యంత్రాంగం. రాజ్‌ఘర్‌లో గత ఆది, సోమ వారాల్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మూడు గుళ్లను కూడా అధికారులు కూల్చివేశారు. వీటిలో రెండు గుడులు ప్రైవేట్ ల్యాండులో ఉండగా, మరొకటి డ్రైనేజిపై ఉంది. అయితే, ఇవి అక్రమ ప్రదేశంలో కట్టారనే ఉద్దేశంతో, అధికారులు కూల్చేశారు.

Hindu Temple under Mosque: మసీదు నిర్మాణ సమయంలో బయటపడ్డ హిందూ ఆలయ శిధిలాలు: రంగంలోకి వి.హెచ్.పి

దీంతో వివాదం మొదలైంది. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. గుడుల కూల్చివేత అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కూల్చివేసిన గుడులను తిరిగి నిర్మిస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. ఇప్పటికే విగ్రహాలను సురక్షితంగా భద్రపరిచినట్లు చెప్పారు. ఎలాంటి వివాదానికి తావులేని స్థలంలో గుడులను నిర్మించనున్నట్లు ప్రకటించారు.