ముస్లిం పోలీసులు గడ్డం తీసేయాలి: ఎస్పీ

ముస్లిం పోలీసులు గడ్డం తీసేయాలి: ఎస్పీ

‘పోలీసులు సమాజాన్ని నీట్‌గా చేయడమే కాదు.. వాళ్లు నీట్‌గా కనిపించాలి’ అని అల్వార్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ పారిస్ దేశ్‌ముఖ్ అంటున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా ముస్లిం పోలీసులను గడ్డం పెంచకూడదని వాటిని కత్తిరించుకోవాలంటూ వెంటనే ఈ రూల్స్ అమలుకావాలని ఆదేశాలు జారీచేశాడు. 

రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం.. 32మంది ముస్లింలు గడ్డం ఉంచుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది. కానీ, తొమ్మిది మంది మాత్రం గడ్డం కచ్చితంగా తీసేయాల్సిందేనంటూ ఆదేశాలిచ్చాడు. పోలీసుల పనే కాదు, వాళ్ల యూనిఫామ్ కూడా సరిగ్గా ఉండాలని వ్యాఖ్యానించాడు. 

పోలీసులకు డిపార్ట్‌మెంట్ హెచ్‍‌ఓడీ అనుమతితో గడ్డం పెంచుకోవచ్చనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారమే 32మంది పోలీసులకు అనుమతినిచ్చారు. తొమ్మిది మందికి మినహాయించి మిగిలిన వారికి రూల్స్ మార్చలేదని ఎస్పీ వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తమైతే పునరాలోచిస్తామని దేశ్ ముఖ్ తెలిపాడు.