Vande Bharat Express: వందే భారత్ రైలు ప్రమాదంపై ప్రశ్నించగా, భిన్న రీతిలో స్పందించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జరిగింది. రాష్ట్రంలోని మాల్దా వద్ద కొందరు ఆగంతకులు మంగళవారం వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. దీంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశమైంది.

Vande Bharat Express: వందే భారత్ రైలు ప్రమాదంపై ప్రశ్నించగా, భిన్న రీతిలో స్పందించిన మమతా బెనర్జీ

Am in good mood, don't ask about that Mamata Banerjee on stone pelting on vande bharat express

Vande Bharat Express: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జరిగింది. రాష్ట్రంలోని మాల్దా వద్ద కొందరు ఆగంతకులు మంగళవారం వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. దీంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశమైంది.

Uttar Pradesh: సుప్రీం కోర్టులో యోగి ప్రభుత్వానికి పెద్ద ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించగా, దీనిపై ఆమె సమాధానం చెప్పకపోగా భిన్న రీతిలో స్పందించారు. తను మంచి మూడ్‭లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలేంటని ఎదురు ప్రశ్నించారు. ‘‘అలాంటి ప్రశ్నలు ఇప్పుడు అడక్కండి. నేను గంగాసాగర్ మేళాకి వెళ్తున్నాను. నేనిప్పుడు మంచి మూడ్‭లో ఉన్నాను. గంగాసాగర్ గురించి ఏమైనా అడగండి’’ అని మమత అన్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటానంటున్న బీజేపీ నేత.. కాకపోతే ఒక్క షరతు!