Amar Jawan Torch: అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదు, తరలిస్తున్నాం అంతే: కేంద్రం

కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని యుద్ధ స్మారకాన్ని బీజేపీ హయాంలో ప్రధాని మోదీ ఏడేళ్ల కాలంలో చేసి, వీర సైనికులకు నిజమైన నివాళి అర్పించారని భాజపా నేతలు చెప్పుకొచ్చారు.

Amar Jawan Torch: అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదు, తరలిస్తున్నాం అంతే: కేంద్రం

Amar Jawan

Amar Jawan Torch: 1971లో పాకిస్తాన్ తో యుద్ధం సమయంలో అమరులైన వీర జవాన్లకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమర్ జవాన్ జ్యోతిని అర్పివేయడం లేదని, జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్దకు తరలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వీర సైనికుల జ్ఞాపకార్ధం ఈ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. 50 ఏళ్ల పాటు నిరాటంకంగా వెలిగిన జ్యోతిని ఆర్పివేస్తున్నట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కేంద్రం చర్యను తప్పుబట్టారు.

Also read: Ganjayi Smuggling: రూ.1.80 కోట్ల విలువచేసే 800 కిలోల గంజాయి స్వాధీనం

1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైనికుల వీరత్వానికి గుర్తుగా ఏర్పాటు చేసిన అమర్ జవాన్ జ్యోతిని భాజపా ప్రభుత్వం ఆర్పివేయడం విచారకరమని రాహుల్ అన్నారు. కొందరికి దేశ భక్తికి, త్యాగానికి తేడా తెలియదని పరోక్షంగా దుయ్యబట్టారు. తాము మరోసారి అమర్ జవాన్ జ్యోతిని వెలిగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు. అమర్ జవాన్ జ్యోతిని ఆర్పివేయడం లేదని..ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్దనున్న మంటలో విలీనం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also read: Sabarimala Temple: ఈ సీజన్ కు “శబరిమల ఆలయం” మూసివేత

1914-1921 మధ్య బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఇండియా గేట్ వద్ద.. 1971 నాటి అమర జవాన్ల పేర్లు లేవని, ప్రస్తుత జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద 1971 భారత్ – పాక్ యుద్ధం సహా.. దేశ సైనికులు పోరాడిన అన్ని యుద్ధాలలో అమరులైన జవాన్ల పేర్లు పొందుపరిచినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని యుద్ధ స్మారకాన్ని బీజేపీ హయాంలో ప్రధాని మోదీ ఏడేళ్ల కాలంలో చేసి, వీర సైనికులకు నిజమైన నివాళి అర్పించారని, జాతిని గర్వింపజేశారని భాజపా నేతలు చెప్పుకొచ్చారు. 2019 ఫిబ్రవరిలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

Also read: Akkineni Nagarjuna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున అమలా దంపతులు