Punjab Election : కెప్టెన్ పార్టీతో బీజేపీ పొత్తు ఖరారు..విజయం 101శాతం తమదేనన్న అమరీందర్

కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవ‌ల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ సింగ్ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ

Punjab Election : కెప్టెన్ పార్టీతో బీజేపీ పొత్తు ఖరారు..విజయం 101శాతం తమదేనన్న అమరీందర్

Amarender

Punjab Election : కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవ‌ల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ సింగ్ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అమరీందర్ సింగ్​ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయమైంది.

బీజేపీతో పొత్తు ప్ర‌య‌త్నాల్లో భాగంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్ర‌వారం కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో ఢిల్లీ భేటీ అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేస్తామ‌ని, గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల స‌ర్దుబాటును చేప‌డ‌తాయ‌ని భేటీ అనంతరం అమరీందర్ ఓ ట్వీట్ లో చెప్పారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 101 శాతం తాము విజ‌యం సాధిస్తామ‌ని కెప్టెన్ సింగ్ ధీమా వ్య‌క్తం చేశారు.

అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఓ ట్వీట్ చేశారు. “ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఈ రోజు నేను స్పష్టం చేస్తున్నాను. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్​ లోక్ కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తుంది. సీట్ల పంపిణీ వంటి విషయాలు తర్వాత చర్చిస్తాం” అని షెకావత్ తెలిపారు.

ALSO READ Omicron Cases In India : దేశంలో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..కేంద్రం కీలక సూచనలు