Punjab Amarinder Singh: అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఇదే

పంజాబ్ మాజీ సీఎం కొత్త పార్టీ పేరు బయటికొచ్చేసింది. బీజేపీలో చేరుతారని వచ్చిన వార్తలను పక్కకుపెట్టేస్తూ.. కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

Punjab Amarinder Singh: అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఇదే

Amarinder Singh

Punjab Amarinder Singh: పంజాబ్ మాజీ సీఎం కొత్త పార్టీ పేరు బయటికొచ్చేసింది. బీజేపీలో చేరుతారని వచ్చిన వార్తలను పక్కకుపెట్టేస్తూ.. కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కాకపోతే పార్టీలో చేరే నాయకులు దాదాపు యాంటీ సింధు ఫ్యాక్షన్ తో ఉండే వారు మాత్రమే ఉంటారట.

అంతకంటే ముందు అమరీందర్ సింగ్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటైన పార్టీ గట్టి పోటీ ఇచ్చి తీరుతుంది. పంజాబ్ లో ఉండే అందరూ సీనియర్ లీడర్లను కూడా కలుస్తున్నారు సింగ్. అంతేకాకుండా చిన్నపాటి పార్టీలను కూడా కలుస్తున్నట్లు చెబుతున్నారు.

సెప్టెంబర్ 30న మాట్లాడిన అమరీందర్.. ‘నేను 52ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా. అలాంటిది సోనియాగాంధీ నాకు 10గంటల 30నిమిషాలకు రాజీనామా చేయమని ప్రకటించారు. సాయంత్రం 4గంటలకు గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించా. 50ఏళ్ల తర్వాత కూడా నమ్మకం, విశ్వసనీయత లేకపోవడం వంటివి పార్టీలో ఉండటంలో ఎటువంటి అర్థం లేదనిపించాయని అని అన్నారు.

………………………………….. : మాచు పిచ్చుకు కార్బ‌న్ న్యూట్ర‌ల్ సర్టిఫికెట్‌..అస‌లేంటీ స‌ర్టిఫికెట్‌?ఎందుకిచ్చారు?

ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఆయన తాను రాజీనామా చేస్తున్నట్లు అప్పుడే చెప్పేశారు. కాంగ్రెస్ ను వదిలేస్తున్నానని.. బీజేపీలో కూడా చేరేది లేదని చెప్పేశారు. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వదిలేయడం కూడా ఇది తొలిసారి కాదు. 1980లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు వాడుకుని గెలిచిన కెప్టెన్.. 1984లో పార్టీని వదిలి అకాలీదళ్ లో చేరాడు. ఆ తర్వాత తిరిగి 1998లో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేశాడు.