Amazon Small Business: లోకల్ బిజినెస్‌ ప్రొడక్ట్‌లు ఇక అమెజాన్‌లో..

ఆన్‌‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ బుధవారం నుంచి ఇండియాలో స్మాల్ బిజినెస్ డేస్ 2021ను స్టార్ట్ చేయనుంది. జులై 2నుంచి 4వరకూ ఈ సేల్స్ అందుబాటులో ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారస్థులు తిరిగి పుంజుకోవడం కోసం...

Amazon Small Business: లోకల్ బిజినెస్‌ ప్రొడక్ట్‌లు ఇక అమెజాన్‌లో..

Amazon India To Host Small Business Days 2021 On July 2 4

Amazon Small Business: ఆన్‌‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ బుధవారం నుంచి ఇండియాలో స్మాల్ బిజినెస్ డేస్ 2021ను స్టార్ట్ చేయనుంది. జులై 2నుంచి 4వరకూ ఈ సేల్స్ అందుబాటులో ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారస్థులు తిరిగి పుంజుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసినట్లు అమెజాన్ తెలిపింది. కొవిడ్ కారణంగా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలహీనపడిన విషయం చూస్తూనే ఉన్నాం.

ఈ ఈవెంట్లో లక్షల్లో మ్యాన్యుఫాక్చరర్లు పాల్గొంటున్నారు. వెయ్యి స్టార్టప్ బ్రాండ్లు లాంచ్ ప్యాడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 6.8లక్షల మహిళా ఎంట్రీప్రెన్యూర్స్ అమెజాన్ కుటుంబంలో చేరుతున్నారు. లోకల్ షాప్స్ నుంచి 50వేలకు పైగా పొరుగు స్టోర్ల వ్యాపారస్థులు అమెజాన్ ప్రోగ్రాంలో ఒకటవుతున్నారు.

ఈ మూడు రోజుల సేల్ లో భాగంగా… అమెజాన్ అందిస్తున్న డీల్స్ తో.. పలు క్యాటగిరీల్లోని ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్లు, వాతావరణానికి తగ్గట్లు వాడుకునే క్రీములు, హోం ఫిట్‌నెస్ సప్లై, ప్రాంతీయ కళాకృతులు లాంటివన్నీ మార్కెట్ ప్లేస్ లో దొరుకుతాయి.

సూక్ష్మ చిన్న మధ్య భారీ తరహా పరిశ్రమలు అనేవి మన ఎకానమీకి వెన్నెముక లాంటివి. వీటి ఎగుమతులతోనే దేశానికి 30శాతం జీడీపీ సమకూరుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 6కోట్ల ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లు 11కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సామాజికాభివృద్ధికి తోడ్పడుతున్న ఈ వ్యవస్థ బలపడేందుకు మరింత ఉపాధి అవకాశాలు పెంచాలి’ అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.