Amazon Prime Day Sale July 2021 : రూ.10వేల లోపు బడ్జెట్ ఫోన్స్ మీ కోసం..

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ప్రైమ్ డే సేల్ పేరుతో వచ్చేసింది. ఆఫర్ల వర్షం కురిపించనుంది. తన ప్రైమ్ మెంబర్స్ కోసం యానువల్ ప్రైమ్ డే సేల్ అనౌన్స్ చేసింది.

Amazon Prime Day Sale July 2021 : రూ.10వేల లోపు బడ్జెట్ ఫోన్స్ మీ కోసం..

Amazon Prime Day Sale July 2021

Amazon Prime Day Sale July 2021 : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ప్రైమ్ డే సేల్ పేరుతో వచ్చేసింది. ఆఫర్ల వర్షం కురిపించనుంది. తన ప్రైమ్ మెంబర్స్ కోసం యానువల్ ప్రైమ్ డే సేల్ అనౌన్స్ చేసింది. జూలై 26 నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. రెండు రోజుల పాటు ఈ సేల్ ఈవెంట్ ఉంటుంది. జూన్ 27 రాత్రి 11.59కి ముగుస్తుంది.

ఇందులో బెస్ట్ డీల్స్ అండ్ సేవింగ్స్ ఉన్నాయని అమెజాన్ చెప్పింది. స్మార్ట్ ఫోన్లు, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ ఎకో డివైజస్ పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఒకవేళ మీరు రూ.10వేల లోపు ఖరీదు చేసే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఒప్పొ, షావోమి, శాంసంగ్ ఇతర కంపెనీల ఫోన్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు మరో ఆఫర్ కూడా ఉంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు మీద 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్స్ కి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. సెలెక్టడ్ ఫోన్ల మీద 40శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాదు ఎక్స్ చేంజ్, నో కాస్ట్ ఈఎంఐ మరిన్ని ఆఫర్లు లభిస్తాయి.

Micromax IN 1: మేడిన్ ఇండియా మైక్రోమ్యాక్ ఐఎన్. దీని ధర దాదాపు రూ.10వేలు. బేస్ 64 జీబీ మోడల్. యాండ్రాయిడ్ 10 ఎక్స్ పీరియన్స్, మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్. 48 మెగా పిక్సల్ కెమెరా. బ్యాక్ లో మరో రెండు సెన్సార్లు ఉన్నాయి.

Poco C3: పోకో సీ3 స్మార్ట్ ఫోన్ ధర రూ.7వేల 499 ను స్టార్ట్ అవుతుంది. 6.35 ఇంచ్ హెచ్ డీ+ డిస్ ప్లే. మీడియాటెక్ హీలియో జీ35 చిప్ సెట్ తో పవర్డ్ అయి ఉంది. 4జీబీ RAM. 64GB ఇంటర్నెల్ స్టోరేజీ. 5000 mah బ్యాటరీ. ట్రిపుల్ రేర్ కెమెరా. 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

Realme Narzo 30A : దీని ధర రూ.8వేల 999. రియల్ మీ నార్జో 30 పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్. 6.5 ఇంచ్ హెచ్ డీ +. మీడియా టెక్ హీలియో జీ85 చిప్ సెట్. డ్యుయల్ సిమ్ కార్డ్. యాండ్రాయిడ్ 10 రన్ అవుతోంది. రియల్ మీ యుఐ. డుయల్ రేర్ కెమెరా. 13 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సర్.

Samsung Galaxy M11:
శాంసంగ్ గెలాక్సీ ఎం11. ధర రూ.9,999. 6.4 ఇంచ్ హెచ్ డీ+ డిస్ ప్లే. ఆక్టా కోర్ ప్రాసెసర్. 4 జీబీ RAM. 64 GB ఇంటర్నల్ స్టోరేజీ. 5,000 mAh బ్యాటరీ. ట్రిపుల్ రేర్ కెమెరా. 13 మెగా పిక్సల్ ప్రైమరీ షూటర్.

Xiaomi Redmi 9 Prime: ఇండియాతో ప్రస్తుతం దీని ధర రూ.9,999. రెమ్ మీ 9 ప్రైమ్ బెస్ట్ సెల్లింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ + డిస్ ప్లే. పవర్డ్ విత్ మీడియా టెక్ హీలియో జీ80 చిప్ సెట్. 4జీబీ RAM. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ. క్వాడ్ రేర్ కెమెరా సిస్టమ్. 13 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సర్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో రెడ్ మీ 9 ఫోన్లపై అదనపు సేల్ ఆఫర్లు ఉంటాయి.