Amazon Prime: డిసెంబర్ 13తర్వాత మెంబర్‌షిప్ కోసం భారీగా వసూలు చేయనున్న అమెజాన్

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఛార్జీలు అమాంతం పెరిగిపోన్నాయి. డిసెంబర్ 13 నుంచి 50శాతం అదనంగా వసూలు చేయాలని డిసైడ్ అయిపోయింది. సంవత్సర ప్లాన్ పై ధరను పెంచనున్నట్లు క్లారిటీ వచ్చేసింది

Amazon Prime: డిసెంబర్ 13తర్వాత మెంబర్‌షిప్ కోసం భారీగా వసూలు చేయనున్న అమెజాన్

Amazon

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఛార్జీలు అమాంతం పెరిగిపోన్నాయి. డిసెంబర్ 13 నుంచి 50శాతం అదనంగా వసూలు చేయాలని డిసైడ్ అయిపోయింది. సంవత్సర ప్లాన్ పై ధరను పెంచనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం రూ.999గా ఉన్న ప్లాన్ డిసెంబర్ 13తర్వాత రూ.1499అవుతుందట.

అంటే రూ.500పెరుగుతుందన్న మాట. అలా జరిగితే 50శాతం అదనంగా పెరిగినట్లు అవుతుంది. మూడు నెలల ప్లాన్ రూ.329కి బదులుగా రూ.459, నెల రోజుల ప్లాన్ రూ.129బదులుగా రూ.179వరకూ పెంచనున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూ చేసుకోవాలనుకునే వారైనా వీలైనంత త్వరగా చేసుకుంటే.. రూ.500అదనంగా చెల్లించాల్సిన దాని నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. రేట్లు మాత్రమే పెరుగుతున్నాయి కానీ, దాంతో పాటు అందించే బెనిఫిట్స్ మాత్రం అలానే కంటిన్యూ చేయనుంది అమెజాన్.

…………………………………….. : 1000 ఎకరాలు దత్తత తీసుకుంటున్న నాగార్జున

అమెజాన్ ప్రైమ్ ఉంటే ఫ్రీ డెలివరీలు, ముందుగానే డెలివరీ చేయడం, మినిమం ఆర్డర్ అవసరం లేకపోవడం వంటివి అందించడంతో పాటు ప్రైమ్ వీడియోస్, ప్రైమ్ మ్యూజిక్ వంటి ఫీచర్లు పొందొచ్చన్నమాట.