ఒక్క క్లిక్..Amazonలో లిక్కర్ సేల్స్

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 08:51 AM IST
ఒక్క క్లిక్..Amazonలో లిక్కర్ సేల్స్

బయటకు వెళ్లకుండానే..సమస్తం..ఒకే ఒక్క Clickతో ఇంటికే తెచ్చుకొనే సౌకర్యం రావడంతో అందరూ నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ఆన్ లైన్ అమ్మకాలు ఫుల్ జోష్ లో కొనసాగుతున్నాయి.

ఆన్ లైన్ అమ్మకాల్లో Amazon, Flipakart, Bigbasket ఎన్నో ఉన్నాయి. బయటకు వెళ్లకుండానే..సామాన్లను తెచ్చుకుంటున్నారు. కానీ తమకు కూడా ఈ ఛాన్స్ వస్తే..మస్త్ ఉంటుండే అని అనుకుంటున్నారు మందుబాబులు. Amazonలో ఇలాంటి అవకాశం ఉండాలని, ఒకే ఒక క్లిక్ తో మందు బాటిల్ వస్తే బెటర్ గా ఉంటుండే అని చాలా మంది అనుకుంటుంటారు.

కానీ అలాంటి ఛాన్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మద్యం అమ్మకాలకు బెంగాల్ బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేసిందని Amazon సంస్థ వెల్లడించింది.

కరోనా వైరస్ కారణంగా..భారతదేశంలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుదేలయ్యాయి. అందులో ఎక్సైజ్ శాఖ కూడా ఒకటి. మద్యం అమ్మకాలు లేకపోవడంతో ఎక్సైజ్ శాఖ ఖజానా బోసి పోయింది. కొన్ని రోజుల క్రిందట..లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో..మద్యం షాపులు కూడా తెరుచుకున్నాయి.

కానీ కేంద్రం విధించిన నిబంధనల కారణంగా..మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఇతర మార్గాలు వెతికే పనిలో పడ్డాయి. ఏకంగా వెబ్ సైట్ ఓపెన్ చేయడం, డోర్ డెలివరీ చేయడం..ఇతర మార్గాల బాట పడ్డాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ Amazonకు అనుమతినివ్వడంతో ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ఆలోచిస్తాయా ? లేదా అనేది చూడాలి. 

Read: ఆన్‌లైన్‌లో ఆల్కహాల్.. డోర్ డెలివరీ.. ప్రభుత్వం అనుమతులు