డేటా ర‌క్ష‌ణ…పార్లమెంట్ కమిటీ ముందు హాజరయ్యేందుకు నిరాకరించిన అమెజాన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2020 / 03:10 PM IST
డేటా ర‌క్ష‌ణ…పార్లమెంట్ కమిటీ ముందు హాజరయ్యేందుకు నిరాకరించిన అమెజాన్

amazon-headquarters

Amazon To Skip Parliament Committee వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019కి సంబంధించి నియమించిన పార్లమెంట్​ సంయుక్త కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అమెజాన్​ నిరాకరించింది. అక్టోబ‌ర్ 28వ తేదీన ఆ స‌మావేశం జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అమెజాన్​ నిర్ణయం ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమేనని ప్యాన‌ల్ చైర్‌ప‌ర్స‌న్, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తెలిపారు.



మైక్రోబ్లాగ్‌ సైట్లు గూగుల్‌, పేటీఎంతో పాటు అమెజాన్‌ కూడా ప్యాన‌ల్ ముందు హాజ‌రుకావాలంటూ పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఇటీవ‌ల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెజాన్​ నిర్ణయం ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపిన మీనాక్షి లేఖి .. ఆ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పష్టం చేశారు.



మ‌రో వైపు, డేటా భ‌ద్రత అంశంలో ప్యాన‌ల్ ముందు ఇవాళ ఫేస్‌బుక్ పాలసీ హెడ్ అంఖి దాస్ హాజ‌ర‌య్యారు. ప్యాన‌ల్ స‌భ్యులు అంఖిని ప‌లు భ‌ద్ర‌తా అంశాల‌పై ప్ర‌శ్న‌లు వేశారు. గూగుల్‌, పేటీఎం సంస్థ‌లు అక్టోబ‌ర్ 29వ తేదీన ప్యాన‌ల్ ముందు హాజ‌రుకానున్నాయి.