Amazon : ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 వివాదంపై స్పందించిన అమెజాన్

ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ 'పాంచజన్య'.. అమెజాన్ సంస్థను 'ఈస్ట్ ఇండియా కంపెనీగా 2.0' గా పోలుస్తూ ఆదివారం విడుదల చేసిన 'పాంచజన్య' టైటిల్ కవర్ తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే

Amazon :  ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 వివాదంపై స్పందించిన అమెజాన్

Amazon

Amazon ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ ‘పాంచజన్య’.. అమెజాన్ సంస్థను ‘ఈస్ట్ ఇండియా కంపెనీగా 2.0’ గా పోలుస్తూ ఆదివారం విడుదల చేసిన ‘పాంచజన్య’ టైటిల్ కవర్ తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. అమెజాన్..దేశీయ ఎంట్రప్రెన్యూర్ కి ముప్పు అని పాంచజన్య తన టైటివ్ కవర్ పై పేర్కొంది. 18వ శతాబ్ధంలో భారత్ పై గుత్తాధిపత్యం కోసం బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీ ఏదైతే చేసిందో ఇప్పుడు అమెజాన్ సంస్థ కూడా అదే చేస్తున్నట్టు.. భారత అధికారులకు అమెజాన్ న్యాయ ప్రతినిధులు లంచాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలను ఉటంకిస్తూ ఆ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అయితే తాజాగా దీనిపై అమెజాన్ సంస్థ స్పందించింది. చిన్న వ్యాపారాలపై సానుకూల ప్రభావాన్ని హైలెట్ చేస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల విడుదల చేసింది అమెజాన్. అమెజాన్ తన ప్రకటనలో..కరోనా మహమ్మారి సమయంలో మూడు లక్షల మంది కొత్త విక్రేతలు మాతో చేరారు. ఇందులో 75వేలమంది స్థానిక పొరుగు దుకాణాలు (దుకాన్స్) నడిపేవాళ్లు. 450 కి పైగా నగరాల నుంచి ఫర్నిచర్, స్టేషనరీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్‌లు, వస్త్రాలు, వైద్య ఉత్పత్తులను విక్రయించారని తెలిపింది.

READ ఇదో ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఏకిపారేసిన ఆర్ఎస్ఎస్ ‘పాంచ‌జ‌న్య‌’ మ్యాగజైన్

అమెజాన్ తన ఎగుమతి కార్యక్రమాన్ని కూడా ప్రకటనలో హైలైట్ చేసింది. 70,000 కి పైగా భారతీయ వ్యాపారాలకు అమెజాన్ సహాయం చేసిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో తయారు చేయబడిన (మేడిన్ ఇండియా) ఉత్పత్తులను విక్రయించడానికి సహాయపడినట్లు తెలిపింది. అమెజాన్ యొక్క ఎగుమతుల కార్యక్రమం వేగంగా ఊపందుకుంది …నేడు మెట్రో నగరాలు మరియు టైర్ 2, టైర్-3,టైర్-4 నగరాల నుండి 70,000కి పైగా ఉన్న ఎగుమతిదారులు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలోని వినియోగదారులకు కోట్లాది మేడిన్ ఇండియా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

READ  కాంగ్రెస్‌లో చేరండి.. గోల్డ్ గెలుచుకోండి

మరోవైపు,పాంచ‌జ‌న్య ఎడిట‌ర్ హితేష్ శంక‌ర్ సోమవారం ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. అమెజాన్‌పై రాసిన ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా వాస్త‌వాల ఆధారంగానే రాశామ‌ని, ఇందులో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు అమెజాన్ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సోష‌ల్ మీడియాలోనూ అమెజాన్‌కు వ్య‌తిరేకంగా ట్రెండ్ కొన‌సాగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ఆర్టిక‌ల్‌లో తాము సాధార‌ణ ప్ర‌జ‌లు, చిన్న వ్యాపార‌స్తుల గురించి ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తామ‌ని తెలిపారు. ఇక గ‌తంలో ఇన్ఫోసిస్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తూ పాంచ‌జ‌న్య‌లో వ‌చ్చిన ఆర్టిక‌ల్‌పైనా హితేష్ స్పందించారు. సాధార‌ణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఆ ఆర్టిక‌ల్ రాసిన‌ట్లు చెప్పారు. జీఎస్టీ, ఇన్‌క‌మ్ ట్యాక్స్ పోర్ట‌ల్‌ల‌ను త‌యారు చేసిన ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన డ‌బ్బు సాధార‌ణ ప్ర‌జ‌లు త‌మ క‌ష్టార్జితంతో చెల్లించిన ప‌న్నులదే అని, అలాంట‌ప్పుడు అందులో లోపాల‌ను స‌వ‌రించ‌ని ఇన్ఫోసిస్‌ను ప్ర‌శ్నిస్తే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.