అంబానీకి బెదిరింపు లేఖ కేసులో ఊహించని ట్విస్ట్, మన్‌సుఖ్‌ది మర్డర్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్దాలు ఉన్న స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరాన్(mansukh hiran-48) అనుమానాస్పద మృతిని మర్డర్ గా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల్చింది. దీనిపై కేసు కూడా బుక్ చేసింది.

అంబానీకి బెదిరింపు లేఖ కేసులో ఊహించని ట్విస్ట్, మన్‌సుఖ్‌ది మర్డర్

Ambani case, ATS probes death as murder: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్దాలు ఉన్న స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరాన్(mansukh hiran-48) అనుమానాస్పద మృతిని మర్డర్ గా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల్చింది. దీనిపై కేసు కూడా బుక్ చేసింది.

మన్ సుఖ్ ది హత్యగా ప్రతిపక్షాలు మొదట్నుంచి ఆరోపిస్తున్నాయి. పోలీసులు మాత్రం కొట్టిపారేస్తూ వచ్చారు. మన్ సుఖ్ నీటిలో మునిగి చనిపోయి ఉండొచ్చని చెప్పారు. అయితే మన్ సుఖ్ ముఖంపై గాయాలు ఉండటంతో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ దీన్ని సీరియస్ గా తీసుకుంది. అతడిని హత్య చేసి వాగులో పడేసినట్టు కేసు నమోదు చేసింది.

మన్ సుఖ్ ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న విషయాలపై ఏటీఎస్ దర్యాఫ్తుని ముమ్మరం చేసింది. ముకేష్ అంబానీని టార్గెట్ చేయడానికి దుండగులు మన్ సుఖ్ కారుని ఎందుకు దొంగిలించారు. తీరా ఆ కారు మన్ సుఖ్ ది అని తేలాక, అతడిని చంపింది ఎవరు? మన్ సుఖ్ ద్వారా తమ బండారం బయటపడుతుందని దుండగులు భయపడ్డారా? మన్ సుఖ్ ని మర్డర్ చేసి నీటిలో పడేయాల్సిన అవసరం ఏంటి? ఇలా అన్ని కోణాల్లో ఏటీఎస్ విచారణ చేస్తోంది. కాగా, మన్ సుఖ్ వ్యాపారవేత్త.

2021 ఫిబ్రవరి 25న ముకేష్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలున్న వాహనం గుర్తించారు. ఆ వాహనం యజమాని హిరేన్‌ మన్‌సుఖ్‌(48). మన్ సుఖ్ బిజినెస్ మాన్. ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం రేపింది. దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని (ఎస్‌యూవీ) పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆ వాహనం తనదేనని, అంతకు వారం రోజుల క్రితం(ఫిబ్రవరి 17, 2021) అది చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం(మార్చి 4,2021) అదృశ్యమైన ఆయన శుక్రవారం(మార్చి 5,2021) శవమై కనిపించారు. ముంబ్రాలోని ఓ వాగులో విగతజీవిగా కనిపించారు.

దేశంలోకెల్లా సంపన్నుడైన అంబానీని అంతం చేస్తామని లేఖలో దుండగులు హెచ్చరించారు. ఇది కేవలం ట్రయల్ మాత్రమేనని.. ముకేష్, ఆయన సతీమణిని బెదిరించారు.