అమెరికాలో ఎన్నికలు : కమలహ్యారిస్ గ్రామంలో ఇడ్లీ సాంబార్ తో అన్నదానం

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 11:44 AM IST
అమెరికాలో ఎన్నికలు : కమలహ్యారిస్ గ్రామంలో ఇడ్లీ సాంబార్ తో అన్నదానం

America president elections : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయింటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాల దృష్టి అంతా అమెరికామీదనే ఉంటుంది. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు మంచి కాకమీదున్నాయి. భారత సంతతికి చెందిన కమలహారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కమలహారిస్ పూర్వీకుల గ్రామం అయిన తులసేంద్రపురంలో గ్రామస్తులు ఆమె గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేశారు.



కలమాహారిస్ కుటుంబం చాన్నాళ్లకిందటే తమిళనాడు నుంచి అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె డెమొక్రాటిక్ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సందర్భంగా ఆమె గెలుపు కోరుకుంటూ కమలహారిస్ పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


స్థానిక ధర్మశస్త ఆలయంలో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించిన గ్రామస్తులు కమలహారిస్ గెలవాలని ప్రార్థించారు. తరువాత అన్నదానం కూడా చేశారు. ఈ అన్నదానంలో కమలహారిస్ కు ఇష్టమైన ‘‘సాంబార్ ఇడ్లీ’’లతో పాటు ఇంకా తదితర వంటకాలతో కూడిన అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి తులసేంద్రపురంలో 200 మందికిపైగా గ్రామస్తులు హాజరయ్యారు. కమలాహారిస్ గెలివాలి అంటూ కోరుకున్నారు.


కమలా హారీస్ తండ్రి జమైకన్ కాగా, తల్లి భారతీయురాలు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి, నల్లజాతి మహిళ కమలా హారీస్ కాగా.. తనకు ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టమని, ఇక నార్త్ ఇండియన్ వంటకం టిక్కా అంటే ఇష్టమని వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్లతో ముచ్చటించిన కమల హారిస్.. తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, అప్పుడప్పుడు తన భర్త డగ్లస్‌కు వంట నేర్పిస్తుంటానని తెలిపిన విషయం తెలిసిందే.