జర్మనీ నుంచి 23 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ లు దిగుమతి

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.

జర్మనీ నుంచి 23 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ లు దిగుమతి

Plane

Oxygen ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రోజుకి 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే, ఇదే సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత కూడా పెద్ద సమస్యగా ఏర్పడింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నవారిసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

దేశంలోని పలు ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత తీవ్రంగా పీడిస్తున్న నేపథ్యంలో కేంద్రరక్షణశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను విమానాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక్కో ఫ్లాంట్.. నిమిషానికి 40లీటర్ల ఆక్సిజన్ మరియు గంటలకు 2400లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల సామర్థం కలిగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. కోవిడ్-19 పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(AFMS)హాస్పిటల్స్ లో మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఉంచనున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తెలిపారు. వారం రోజుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్లాంట్లు జర్మనీ నుంచి భారత్ కు రానున్నాయని భూషణ్ తెలిపారు.