బీహార్ లో ఎన్నికల ప్రచారం మొదలైంది!

  • Published By: venkaiahnaidu ,Published On : June 7, 2020 / 09:09 AM IST
బీహార్ లో ఎన్నికల ప్రచారం మొదలైంది!

బీహార్ లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా…రాష్ట్రంలో అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ప్రారంభించాయి. బీహార్ లో ముఖ్యమైన మూడు పార్టీలు జేడీయూ,ఆర్జేడీ,బీజేపీ ఇవాళ అధికారికింగా ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రారంభిస్తున్నాయి. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ బీహార్ లో తన మొదటిసారిగా డిజిటల్ ర్యాలీలో పాల్గొననున్నారు.

అమిత్ షా డిజిటల్ ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా 243నియోజకవర్గాల నుంచి 1లక్ష మంది పాల్గొననున్నారు. గడచిన ఆరేళ్లుగా మోడీ సర్కార్ చేపట్టిన,చేపట్టబోయే కార్యక్రమాలు గురించి అమిత్ షా డిజిటల్ ర్యాలీలో ప్రసంగించనున్నారు. జేడీయూ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని,సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఈ సందర్భంగా కార్యకర్తలకు షా సృష్టం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4గంటలకు ఈ వర్చువల్ ర్యాలీ జరుగుతుంది.

మరోవైపు అమిత్ షా నిర్వహిస్తున్న వర్చువల్ ర్యాలీని వ్యతిరేకిస్తూ ఆర్జేడీ వర్చువల్ ఆందోళనను నిర్వహించింది. ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో ఆర్జేడీ నాయకులు తేజస్సీ యాదవ్,తేజ్ ప్రతాప్ యాదవ్, వాళ్ల తల్లి..మాజీ సీఎం రబ్రీదేవీ తమ ఇంటి బయట ప్లేట్లను గరిటతో మోగిస్తూ ఆందోళన నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో విధించబడిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలసకూలీల పరిస్థితికి వ్యతిరేకంగా కూడా ఈ ఆందోళనను ఆర్జేడీ నిర్వహించింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్త…ఆందోళనలో పాల్గొన్నవాళ్లు రౌండ్ సర్కిల్స్ లో నిలబడి గరిటతో ప్లేట్లను మోగించారు.

ఈ రోజుని(జూన్-7,2020) శ్రద్దాంజలి దివస్ గా పాటిస్తున్నట్లు ఆర్జేడీ తెలిపింది. పాట్నాలోని వివిధ ఏరియాల్లో శ్రద్దాంజలి దివస్ పేరుతో ఆర్జేడీ ఆందోళనలు నిర్వహించింది. వర్చువల్ సే యాక్చువల్ ముద్దోన్ కా ఎన్ కౌంటర్ అంటూ పాట్నా వీధుల్లో అమిత్ షా వర్చువల్ మీటింగ్ ను వ్యతిరేకిస్తూ ఆర్జేడీ నాయకులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. బీజేపీది రాజకీయ రాబంధువాదం అని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అన్నారు. మనుషులు ప్రాణాలు పోతున్నా ఎన్నికల విజయంలో మాత్రమే బీజేపీ ఆశక్తిగా ఉందని తేజస్వీ ఆరోపించారు.

శనివారం సీఎం నితీష్ కుమార్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ ఓ పోసర్ట్ ను ఆర్జేడీ ఆఫీస్ బయట ఉంచారు తేజస్వీ. గత 75 రోజుల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన ముఖ్యమంత్రి నితీష్… అదే సమయంలో తన పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రారంభించారు. మరోవైపు…మిస్టర్ గుడ్ గవర్నెన్స్ అనే సీఎం నితీష్ కుమార్ ఇమేజ్…వలసకూలీల ఇష్యూని బీట్ చేస్తుందని జేడీయూ మిత్రపక్షాలైన బీజేపీ,ఎల్జేపీ పార్టీలు భావిస్తున్నాయి.