Amid Omicron: ఒమిక్రాన్ హైరిస్క్ అలర్ట్.. నిఘాలో 600మంది

హైరిస్క్ కంట్రీస్ నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకూడదు అని నిర్ణయించారు కర్ణాటక అధికారులు.

Amid Omicron: ఒమిక్రాన్ హైరిస్క్ అలర్ట్.. నిఘాలో 600మంది

Omicran Bengaluru

Amid Omicron: హైరిస్క్ కంట్రీస్ నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకూడదు అని నిర్ణయించారు కర్ణాటక అధికారులు. ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచమంతా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన ఇద్దరు వ్యక్తులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన తరువాత అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు.

అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఒమిక్రాన్‌పై పెరుగుతున్న ఆందోళన మధ్య బెంగళూరు విమానాశ్రయంలో పరీక్షలు, శానిటైజేషన్‌ను కఠినతరం చేశారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ K సుధాకర్ మాట్లాడుతూ.. బెంగళూరులో సౌతాఫ్రికన్లకు సోకింది ఒమిక్రాన్ కాదని, ఒకరిలో డెల్టా వేరియంట్, మరొకరిలో డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్ ఉందని వెల్లడించారు.

నవంబర్ 26వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వీరిద్దరూ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. బెంగుళూరులోని విమానాశ్రయ అధికారులు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అందరికీ RT PCR మరియు రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. బెంగళూరుకు రాగానే కోవిడ్-19 నెగిటివ్ వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులందరినీ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

Corona Positive : దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తితోపాటు కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా

ఏడు రోజుల తర్వాత వారిని మళ్లీ పరీక్షించనున్నారు” అని బెంగళూరు రూరల్ జిల్లా ఆరోగ్య అధికారి తిప్పేస్వామి తెలిపారు, అలాంటి 598 మంది ప్రయాణికులు ఇప్పటివరకు నిఘాలో ఉన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టు అధికారులు ప్రధానంగా వ్యాక్సినేషన్ రిపోర్టు, ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్, హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ రిపోర్టులను పరిశీలిస్తున్నారని తిప్పేస్వామి వెల్లడించారు.

“హై-రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు మేము విమానాశ్రయంలో RT PCR పరీక్షను కూడా నిర్వహిస్తున్నాము. వారు నెగెటివ్ అని తేలితే, వారు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లవలసి ఉంటుంది. పాజిటివ్ వస్తే మాత్రం.. వారిని ఆసుపత్రికి ఐసోలేషన్ కోసం తరలిస్తారు.” అన్నారాయన.

Omicron: భయపెడుతున్న ఒమిక్రాన్‌.. సరిహద్దులు మూసివేత!

అంతర్జాతీయ మరియు దేశీయ ప్రయాణీకులను తనిఖీ చేయడానికి 49 మంది ఆరోగ్య అధికారులు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చేవారి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష, వ్యాక్సిన్ రిపోర్ట్‌ని కూడా పరీక్షిస్తున్నామని, ప్రయాణికుల సమస్యపై అధికారులు చర్చిస్తున్నట్లుగా తిప్పేస్వామి తెలిపారు.