MK Stalin : కుటుంబానికి రూ.5వేలు.. సీఎం మరో కీలక నిర్ణయం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాల తయారీదారులకు అండగా నిలిచారు. స్టాలిన్ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. గణేశ్ విగ్రహాల తయారీదారుల

MK Stalin : కుటుంబానికి రూ.5వేలు.. సీఎం మరో కీలక నిర్ణయం

Mk Stalin

MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాల తయారీదారులకు అండగా నిలిచారు. స్టాలిన్ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. గణేశ్ విగ్రహాల తయారీదారులకు రూ.5వేల ఆర్థిక సాయం చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు. రాష్ట్రంలోని 3వేల కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్న స్టాలిన్… కరోనా వల్ల బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ ఉత్సవాలు, విగ్రహ తయారీపై నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నారు. ఈ పరిస్థితుల్లో సహాయపడటానికి వినాయక విగ్రహాలను తయారుచేసే వారికి రూ. .5వేలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

గతేడాది కూడా కుమ్మరులకు ఇలానే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో వారికి డబ్బు సాయం చేసింది. రాష్ట్రంలో 12వేల మంది కుమ్మరి కుటుంబాలు ఉన్నాయి. వారిలో 3వేల మంది వినాయక చవితికి గణేష్ విగ్రహాలు తయారు చేస్తారు. అదే వారి జీననాధారం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గణేష్ ఉత్సవాలు, విగ్రహ తయారీపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో ఆర్థిక సాయం ప్రకటించింది.

బక్రిద్, ఓనమ్ పండుగల కారణంగా కేరళలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేష్ ఉత్సవాలు, విగ్రహాలు తయారీ, ఏర్పాటుపై నిషేధం విధించారు. కరోనా కట్టడిలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఎం వివరణ ఇచ్చారు. కాగా, బీజేపీ నేతలు ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. వినాయకచవితిపై కరోనా ఆంక్షలు సరికాదన్నారు.