Covid Cases: మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

Covid Cases: మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Covid Cases: కోవిడ్ తీవ్రత తగ్గిందనుకుంటున్న సమయంలో దేశంలో మళ్లీ కేసులు కలవరపెడుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

కోవిడ్ కేసులు పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్, చికిత్స, ట్రాకింగ్ వంటివి వేగంగా నిర్వహించాలని సూచించింది. కోవిడ్ వ్యాప్తి అరికట్టేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇటీవలి కాలంలో ఒక్క రోజులోనే 700కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్రం ఆందోళనవ్యక్తం చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,623కు చేరింది. గత నవంబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. నాలుగు నెలల తర్వాత మళ్లీ కేసులు పెరిగాయి. చివరగా గత నవంబర్ 12న 734 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.

ప్రస్తుతం కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జిల్లా స్థాయిలోనూ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం కేసుల శాతం 0.01గా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.80గా ఉంది. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.19గా ఉంది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297గా ఉంది. దేశంలో మొత్తం 220.64 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.