Complete Lockdown : రాష్ట్రంలో మళ్లీ పూర్తి లాక్‌డౌన్ : కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

దేశవ్యాప్తంగా కరనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా జూలై నెలలో మళ్లీ పూర్తి లాక్ డౌన్ పడనుంది.

Complete Lockdown : రాష్ట్రంలో మళ్లీ పూర్తి లాక్‌డౌన్ : కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Amid Sharp Rise In Covid Cases, Kerala Imposes Complete Lockdown

Kerala imposes complete lockdown : దేశవ్యాప్తంగా కరనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా జూలై నెలలో మళ్లీ పూర్తి లాక్ డౌన్ పడనుంది. ఒకవైపు కేరళలో జికా వైరస్ వణికిస్తుండగా.. మరోవైపు రోజువారీ కొత్త కరోనా కేసులు వేలసంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల కంటే.. ఒక కేరళలోని 30 శాతం నమోదవుతున్నాయి. అలాగే పాజిటివిటీ రేటు కూడా అదే స్థాయిలో ఉంది.

అత్యవసర పరిస్థితి దృష్ట్యా కేరళ ప్రభుత్వం మళ్లీ పూర్తి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. అది కూడా జూలై 17, జూలై 18 తేదీల్లో వారంతపు లాక్‌డౌన్‌ విధించింది. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను మళ్లీ విధించింది. ఈ కొత్త కరోనా ఆంక్షలు గురువారం (జూలై 15) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.


వైరస్ తీవ్రత ఉన్న పంచాయతీలను టెస్ట్ పాజిటివిటీ రేటు ఆధారంగా A, B, C, D కేటగిరీలుగా విభజించింది. దీని ప్రకారం.. A కేటగిరీలో 165 స్థానిక సంస్థలు (TPR 6 శాతం కన్నా తక్కువ), B కేటగిరీలో 473 (6 -12 శాతం TPR), C కేటగిరీలో 316 (12-18 శాతం TPR), 80 ఉన్నాయి. D కేటగిరీ (TPR 18 శాతం కంటే ఎక్కువ)గా ఉన్నాయి. దీని ఆధారంగా ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. A,B,C కేటగిరీ ప్రాంతాల్లో షాపులు రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటాయి. అలాగే బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాల్లో ప్రజలను అనుమతించవచ్చు.