Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం

52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది.

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం

Gyanvapi

Gyanvapi Mosque: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు పరిసర ప్రాంతాల్లో వీడియో సర్వే నిర్వహణపై గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడింది. 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది. ఈమేరకు వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం నుంచి జ్ఞానవాపి మసీదు ప్రాంతం వరకు ఉన్న రహదారులను పోలీసులు మూసివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. శనివారం ఉదయం ఇరుపక్షాల సభ్యులతో(పిటిషన్ తరుపు వారు, మసీదు నిర్వాహకులు) కలిసి మసీదులోకి ప్రవేశించిన సర్వే అధికారుల బృందం ముందుగా మసీదులోని భూగర్భ ప్రాంతంలో ఉన్న మూడు గదులను పరిశీలించారు.

Other Stories:Chintan Shivir: కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్.. పార్టీ నేతలతో రాహుల్ భేటీ

అనంతరం మసీదులోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న గోడను సర్వే చేశారు అధికారులు. సర్వే సమయంలో మసీదులోని ఏవైనా గదులు తాళం వేసి ఉన్నా.. వాటిని పగలగొట్టి సర్వే కొనసాగించాలని అపెక్స్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సర్వే సమయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించినట్లయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, పూర్తి అంశాలను పర్యవేక్షించాలని జిల్లా మేజిస్ట్రేట్ మరియు పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలంటూ ముస్లిం మత పెద్దలు, మసీదు నిర్వాహకులు వేసిన పిటిషన్ ను జిల్లా మేజిస్ట్రేట్ తిరస్కరించింది. సర్వే కొనసాగి తీరుతుందని కోర్టు స్పష్టం చేసింది.

Other Stories:Hunters Murder Police: మధ్యప్రదేశ్‌లో ఘోరం: కృష్ణ జింకల వేటకు వచ్చి ముగ్గురు పోలీసు అధికారులను కాల్చి చంపిన వేటగాళ్లు

ఈనేపధ్యంలో సర్వే నిమిత్తం అంతక్రితం నియమించిన అడ్వకేట్ కమిషనర్ కి తోడు మరో ఇద్దరు లాయర్లను కూడా అదనంగా నియమించింది జిల్లా కోర్టు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు పరిసర ప్రాంతాల్లో హిందూ దేవతల ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం ఆ ఆలయాల్లోని దేవతలు పూజలకు నోచుకోవడం లేదని ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈక్రమంలో వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఈ సర్వేకు ఆదేశించింది. పూర్తి విచారణ అనంతరం మే 17లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.