ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయాడు..కోటి ఆర్థిక సహాయం

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 12:27 AM IST
ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయాడు..కోటి ఆర్థిక సహాయం

దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఫైర్ డిపార్ట్ మెంట్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 9 నెలల క్రితమే ఇతనికి వివాహం అయ్యింది. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అమిత్ బలియాన్ ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. అమిత్ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ట్వీట్ చేశారు. ఇతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

2020, జనవరి 02వ తేదీ గురువారం బ్యాటరీలు తయారు చేసే కంపెనీలో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. 35 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

పేలుడు కారణంగా భవనం అధికభాగం కూలిపోయింది. ఈ సమయంలో అమిత్ బలియాన్‌తో పాటు ఇతరులు చిక్కుకపోయారు. కొద్దిసేపటి అనంతరం ముగ్గురిని రక్షించి బయటకు తీశారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ తీవ్రగాయపడిన…అమిత్..అప్పటికే మరణించినట్లు..వైద్యులు వెల్లడించారు. గత సంవత్సరం జూన్ 10వ తేదీన అన్నీ శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫైర్ సర్వీస్‌లో అమిత్ జాయిన్ అయ్యాడు. ఇతనికి భార్య, తండ్రి, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఇతను మృతి చెందడంపై లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్ సంతాపం తెలియచేశారు. 

Read More : ఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు : కుప్పకూలిన భవనం..శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు