పెద్దాయన లేకుండానే : అమిత్ షా నామినేషన్

బీజేపీ చీఫ్ అమిత్‌ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్‌ వేశారు.

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 07:18 AM IST
పెద్దాయన లేకుండానే : అమిత్ షా నామినేషన్

బీజేపీ చీఫ్ అమిత్‌ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్‌ వేశారు.

బీజేపీ చీఫ్ అమిత్‌ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ వేయడానికి ముందు భారత ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.
Read Also : లోకేష్ పప్పు.. పప్పు : జయంతికి.. వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల

నామినేషన్‌ కార్యక్రమంలో ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. బూత్‌ స్థాయి కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డాను అని షా చెప్పారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం లేరని అన్నారు. రాజ్యసభ ఎంపీ అయిన అమిత్‌ షా తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

బీజేపీలో మోడీ తర్వాత అంతటి పవర్ ఉన్న వ్యక్తి అమిత్ షా నే. దీంతో బీజేపీ అగ్రనాయకులంతా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీనగర్‌ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ మాత్రం కనిపించ లేదు. అద్వానీ గాంధీ నగర్‌ స్థానం నుంచి 6 సార్లు వరుసగా గెలిచారు. 1991 నుంచి గెలుస్తూ వచ్చారు. ఈసారి 75ఏళ్లు పైబడిన వారికి ఎంపీ సీట్లు ఇవ్వకూడదని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు. దీంతో అద్వానీకి టికెట్ ఇవ్వలేదు. 26 ఎంపీ స్థానాలున్న గుజరాత్‌లో నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్‌ 4. ఏప్రిల్‌ 23న పోలింగ్ జరగనుంది.

Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?