బెంగాల్‌లో అమిత్ షా, ఏమి జరుగుతోంది ? బీజేపీలోకి భారీగా చేరికలు?

బెంగాల్‌లో అమిత్ షా, ఏమి జరుగుతోంది ? బీజేపీలోకి భారీగా చేరికలు?

Amit Shah in Bengal : పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన కాకా పుట్టిస్తోంది. మరో నాలుగు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే..పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ వ్యూహరచనలు చేస్తోంది. టీఎంసీ Vs బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో…మరోసారి బెంగాల్‌ గడ్డపై షా మరోసారి అడుగు పెట్టారు. ఆయన ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా..వివిధ పార్టీలకు చెందిన నేతలు భారీగా బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అధికారపక్షంలో ఉన్నటీఎంసీకి భారీ షాక్‌లు తగులనున్నాయని అంచనా వేస్తున్నారు.

ఆ పార్టీకి నష్టాన్ని కలుగచేసి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాలని షా డిసైడ్ అయ్యారని అనుకుంటున్నారు. మాజీ మంత్రి, తృణముల్ కీలక నేత సుబేందు అధికారి బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఐదుగురు టీఎంసీ, ఇద్దరు లెఫ్ట్, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారని తెలుస్తోంది.

ఇక అమిత్ షా పర్యటన విషయానికి వస్తే…శనివారం తెల్లవారుజామున కోల్ కతా చేరుకున్నారు. ఉదయం స్వామి వివేకానందుడి జన్మించిన ప్రదేశానికి చేరుకున్నారు. మిడ్నాపూర్‌లోని స్వాతంత్ర్య సమరయోధుడు కుదీరామ్ బోస్ పూర్వికుల గ్రామానికి వెళ్లారు. కోల్ కతాలోని సిమ్లా వీధిలో వివేకానంద పూర్వీకుల నిలవాసాన్ని అమిత్ షా సందర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఆయన సిద్ధాంతాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు షా. అనంతరం పశ్చిమ మిడ్నాపూర్‌కు చేరుకున్నారు. సిద్ధేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుడు కుదీరామ్ బోస్ స్వగ్రామానికి వెళ్లారు. బోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. పర్యటనలో భాగంగా..కుదీరామ్ కుటుంబసభ్యులను షా కలుసుకోనున్నారు. బెలిజూరి గ్రామంలో ఓ రైతు షా సహపంక్తి భోజనం చేశారు షా. మిడ్నాపూర్‌లో జరిగే ర్యాలీల్లో షా పాల్గొననున్నారు. బీజేపీ నిర్వహించే ర్యాలీలో పలువురు టీఎంసీ రెబల్ నేతలు కమలం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.