Amith Shah : జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరు..యువత భాగస్వామ్యంతోనే ఉగ్రవాదానికి చెక్
జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని .. ఈ అభివృద్ధిలో యువత

Amith Shah జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని .. ఈ అభివృద్ధిలో యువత భాగమవ్వాలని, దాని ద్వారానే ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. 2019లో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
మూడు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా అమిత్ షా.. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జమ్మూలో ఐఐటీ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన అమిత్ షా.. అక్కడ మొక్క నాటారు. అనంతరం జమ్మూలోని భగవతీ నగర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గొన్న అమిత్ షా..జమ్మూ ప్రజలకు అన్యాయం జరిగే కాలం ముగిసిపోయిందన్నారు.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ఊపందుకుందని చెప్పారు. అయితే కొంతమంది ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని.. కానీ ఎవరూ దీన్ని అడ్డుకోలేరని తాను భరోసా ఇస్తున్నానన్నారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. 2022 చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.
జమ్ముకశ్మీర్.. వైష్ణోదేవి, ప్రేమ్‌నాథ్ డోగ్రా లాంటి ప్రసిద్ధ ఆలయాలున్న భూమి అని, శ్యామప్రసాద్ ముఖర్జి లాంటి మహనీయుడిని త్యాగం చేసిన నేల అని షా పేర్కొన్నారు. ప్రేమ్‌నాథ్ డోగ్రాను..దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జితో కలిసి ప్రేమనాథ్ డోగ్రా.. టూ విధాన్, టూ నిషాన్, టూ ప్రధాన్ దేశంలో ఎప్పటికీ వర్కవుట్ కావనే నినాదం ఇచ్చారన్నారు. ఇక,సోమవారం కూడా హోం మంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటనను కొనసాగించనున్నారు.
ALSO READ ఇటలీ,బ్రిటన్ పర్యటనకు మోదీ
- Amit Shah: అమిత్ షా ఫేక్ ఫేస్బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తి అరెస్ట్
- KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్
- KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్
- Amit Shah On MinorityReservations : అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు-అమిత్ షా సంచలన ప్రకటన
- Amit Shah : అమిత్ షా పర్యటన వివరాలు..ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..
1Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
2Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
3KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
4Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
5Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
6Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
7Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
8Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
9Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
10Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!