Amith Shah : ఫ్రాంక్లీ స్పీకింగ్.. శ్రీనగర్ పర్యటనలో బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ ని తొలగించిన అమిత్ షా

మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా చివరిరోజైన ఇవాళ(అక్టోబర్-25,2021) శ్రీనగర్ లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శ్రీనగర్ లోని షేర్ ఈ కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్ లో

10TV Telugu News

Amith Shah మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా చివరిరోజైన ఇవాళ(అక్టోబర్-25,2021) శ్రీనగర్ లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శ్రీనగర్ లోని షేర్ ఈ కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి వెళ్లిన అమిత్ షా..అక్కడ ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ షీల్డ్ ని తొలగించాలని ఆదేశించారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది..లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలో బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ని అక్కడ నుంచి తీసేశారు.

అనంతరం సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో అమిత్ షా..ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను ఈ రోజు మీతో సృష్టంగా మాట్లాడాలనుకుంటున్నాను అని అక్కడున్న ప్రజలనుద్దేశించి షా అన్నారు. కాబట్టి ఇక్కడ బుల్లెట్ ఫ్రూఫ్ రక్షణ కానీ సెక్యూరిటీ కానీ లేదు. నేను మీలో ఒకడిగా మీ ముందు నిలబడ్డాను అని అమిత్ షా అన్నారు. మనం పాకిస్తాన్ తో మాట్లాడాలి అని ఫరూక్ అబ్దుల్లా తమకు సూచిస్తున్నాడని..అయితే తాను కశ్మీర్ వ్యాలీ ప్రజలు,యువతతోనే మాట్లాడతానని అందరికీ సృష్టం చేయాలనుకుంటున్నా అని అమిత్ షా పేర్కొన్నారు.

ఆర్టికల్ 370 రద్దు వెనుక..కశ్మీర్,జమ్మూ,లడఖ్ ప్రాంతాలను అభివృద్ధి వైపు నడిపించాలన్న ఒకే ఒక ఉద్దేశ్యం ఉందన్నారు. తమ ప్రయత్నాల ఫలితాలను 2024కల్లా అందరూ చూస్తారన్నారు. వైద్య‌విద్య‌ను అభ్య‌సించాలంటే క‌శ్మీరీ యువ‌త ఇక పాకిస్తాన్ వెళ్లనవసరం లేదన్నారు అమిత్ షా. ఇంత‌కుముందు 500 మంది యువ‌కులు మాత్ర‌మే వైద్యుల‌య్యేవారు. ఇప్పుడు నూత‌న మెడిక‌ల్ కాలేజీలు వచ్చాక రెండువేల మంది యువ‌కులు వైద్యులు అవుతార‌న్నారు. ఇంత‌కుముందు జ‌మ్ముక‌శ్మీర్‌ను పాలించిన మూడు కుటుంబాలు మాత్ర‌మే క‌శ్మీర్ లోయ‌లో మూడు మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేశాయ‌న్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో ఏడు నూత‌న మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్ లో ముఖ్యంగా శ్రీనగర్ లో మైనార్టీలైన హిందువులు,సిక్కులు మరియు స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో జమ్మూకశ్మీర్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న వేళ అమిత్ షా కశ్మీర్ పర్యటన కొనసాగుతోంది. అయితే 2019లో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అమిత్ షా జమ్మూకశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి.

సోమవారం ఉదయం శ్రీనగర్ కి దగ్గర్లోని గందేర్బాల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమిత్ షా. అక్కేడే ఉన్న మాతా రగ్యా దేవీ ఆలయంలో కూడా అమిత్ షా పూజలు నిర్వహించారు.  కాగా,ఇవాళ అమిత్ షా..కశ్మీరీలు సంప్రదాయంగా ధరించే “పేరాన్”ను ధరించారు.

ALSO READ PM Modi : వారణాశిలో పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ని ప్రారంభించిన మోదీ