Gujarat polls..BJP CM Candidate : బీజేపీ సీఎం అభ్యర్థి భూపేంద్ర పటేలే : అమిత్ షా

డిసెంబర్ లో జరుగనునున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు అమిత్ షా.

Gujarat polls..BJP CM Candidate : బీజేపీ సీఎం అభ్యర్థి భూపేంద్ర పటేలే : అమిత్ షా

amit shah said if bjp wins gujarat polls cm bhupendra patel

Gujarat polls..BJP cm candidate bhupendra patel : డిసెంబర్ లో జరుగనునున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న భూపేంద్ర పటేలే మా సీఎం అభ్యర్థి అని ప్రకటించారు అమిత్ షా. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారు అని ప్రకటించారు.

BJP Gujarat poll list 2022 : బీజేపీ అభ్యర్థిగా గుజరాత్ ఎన్నికల బరిలో క్రికెటర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య

కాగా..ఈ సారి గుజరాత్ లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్ కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనుంది. పంజాబ్ లో అనూహ్యంగా గెలుపొంది అధికారం చేపట్టిన ఆప్ అదే దూకుడుతో గుజరాత్ లో కూడా గెలిచి తీరుతాం అనే ధీమాతో ఉంది. దీని కోసం ఢిల్లీ సీఎం..ఆప్ చీఫ్ అరవింత్ కేజ్రీవాల్ గుజరాత్ లో తరచు సభులు సమావేశాలు నిర్వహించటమేకాదు..గుజరాత్ ప్రజలను ఆకట్టుకునేలా హామీలు కూడా గుప్పిస్తున్నారు.

ఇటువంటి సిట్యువేషన్ లో ప్రధాని మోడీతో పాటు సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలను అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వచ్చిన ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు బదులిస్తు… గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.

Gujarat Poll 2022 : 27 ఏళ్లలో తొలిసారి త్రిముఖపోరు .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా?

కాగా గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్రకు అనూహ్యంగా సీఎం పదవి దక్కింది. విజయ్ రూపానీ నుంచి ఆయన సీఎం కుర్చీని దక్కించుకున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి భూపేంద్ర పటేల్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెప్టెంబర్ 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎం అయ్యారు.

గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి.వీటిలో రెండు విదతలగా ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 1,5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి కూడా విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది.

Gujarat Poll 2022 : గుజరాత్ ఎన్నికలపైనే దేశమంతా ఫోకస్ .. కారణాలు ఇవే..