Manipur violence: మణిపూర్ అల్లర్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Manipur violence: మణిపూర్ అల్లర్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah: మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజులుగా స్వయంగా మణిపూర్ వెళ్లి అల్లర్లకు సంబంధించి స్థానిక సీఎం ఎన్.బీరెన్ సింగ్ సహా ఇతరులతో చర్చించిన ఆయన బుధవారం మణిపూర్ రాజధాని మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా, చట్టబద్ధంగా పూర్తి నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగుతుందని మణిపూర్ ప్రజలకు తాను తెలియజేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.

Maharashtra Children Trafficking : రైలులో 59మంది పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది  

‘‘ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై ప్రత్యేక సీబీఐ బృందం దర్యాప్తును పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 లక్షల రూపాయల చొప్పున అందించడంతో పాటు సంఘర్షణలో ప్రభావితమైన వారికి ఉపశమనం, పునరావాసం సిద్ధం చేశాం. మణిపూర్ గవర్నర్ పౌర సమాజ సభ్యులతో కూడిన శాంతి కమిటీకి నాయకత్వం వహిస్తారు’’ అని అన్నారు.

Rajasthan Politics: అశోక్ గెహ్లాట్‭తో చేతులు కలిపినప్పటికీ ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న సచిన్ పైలట్

మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరు కొనసాగుతోంది. అయితే ఇవరు వర్గాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు హోంమంత్రి అమిత్ షా నాలుగు రోజుల మణిపూర్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన భద్రతా బలగాలు, పౌర అధికారులతో సమావేశాలకు సమావేశమై వివిధ చర్చలు జరిపారు. “నేను మణిపూర్‌లోని ఇంఫాల్, మోరే, చురచంద్‌పూర్‌తో సహా గత మూడు రోజుల్లో అనేక ప్రదేశాలను సందర్శించాను. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి అధికారులతో సమావేశాలు నిర్వహించాను. నేను మెయిటీ, కుకీ కమ్యూనిటీల సీఎస్ఓలను కలిశాను” అని అమిత్ షా తెలిపారు.