Amith Shah : పాక్ కు అమిత్ షా వార్నింగ్..చర్చల్లేవ్,సర్జికల్ స్ట్రైక్స్ తోనే సమాధానమిస్తాం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా

Amith Shah : పాక్ కు అమిత్ షా వార్నింగ్..చర్చల్లేవ్,సర్జికల్ స్ట్రైక్స్ తోనే సమాధానమిస్తాం

Amith (3)

Amith Shah కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా..అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డటం మరియు కశ్మీర్ లో పౌరులను హత్య చేసేందుకు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడాన్ని పాకిస్తాన్ ఆపకపోతే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వార్పింగ్ ఇచ్చారు.

భారత్.. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోదని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయని అమిత్ షా గుర్తుచేశారు. 2016లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌. భారత స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌న్న గ‌ట్టి సందేశం దీని ద్వారా వెళ్లింది. ఒక‌ప్పుడు చ‌ర్చ‌లు జ‌రిగేవి.. కానీ ఇప్పుడు దెబ్బ‌కు దెబ్బ కొట్టే స‌మ‌యం అని అమిత్ షా అన్నారు.

అయితే, భారత్ లోని ఉరి,పఠాన్ కోట్,గురుదాస్ పూర్ లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ లో భారత్..పాకిస్తాన్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టి,ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఉరి ఉగ్రదాడి జరిగిన 11 రోజుల తర్వాత సెప్టెంబర్-29,2016న భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది.

ALSO READ  నిలకడగా మాజీ ప్రధాని ఆరోగ్యం..త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష