Kolkata Airport:అంపన్ తుఫాన్ విధ్వంసం : నీట మునిగిన కోల్ కతా ఎయిర్ పోర్టు

Kolkata Airport:అంపన్ తుఫాన్ విధ్వంసం : నీట మునిగిన కోల్ కతా ఎయిర్ పోర్టు

Kolkata Airport:అంపన్ తుఫాన్ పశ్చిమబెంగాల్ ను వణికించింది. కుండపోతగా వర్షం కురవడంతో కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్బంధం అయింది. రన్ వే, హ్యాంగర్స్ పూర్తిగా నీటి మునిగాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు విరిగిపడ్డాయి.

దీంతో విమానాలు ధ్వంసం అయ్యాయి. ఎయిర్ పోర్టులో అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి మార్చి 25న లాక్ డౌన్ విధించడంతో ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కార్గో విమానాలను మాత్రమే నడుపుతున్నారు.

తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లో 12 మంది మృతి చెందారు. బలమైన ఈదురు గాలులు, వర్షాల వల్ల వేలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బెంగాల్ తీరం వెంబడి గంటకు 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

Read: క్వారంటైన్ లో మందు కోసం చిందులేసిన బార్ డ్యాన్సర్లు