Amritpal Singh: యోధుడిలా లొంగిపోయాడు, గర్వంగా ఉంది.. అమృతపాల్ సింగ్ అరెస్టుపై తల్లిదండ్రుల రియాక్షన్ ఇది

నేను పారిపోయేవాడిని కాదు, తిరుగుబాటు దారుడిని. అరెస్టుకు నేను భయపడను. నా గురువు అయిన జర్నైల్ బింద్రన్‭వాలే ఆశీస్సులు తీసుకున్న అనంతరం అరెస్ట్ అవుతాను. నా మద్దతుదారులను హింసిస్తుంటే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు

Amritpal Singh: యోధుడిలా లొంగిపోయాడు, గర్వంగా ఉంది.. అమృతపాల్ సింగ్ అరెస్టుపై తల్లిదండ్రుల రియాక్షన్ ఇది

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్థానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ అరెస్టును అతడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అతడు యోధుడిలా లొంగిపోయాడని, తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. దీనిపై అమృతపాల్ సింగ్ తల్లి బల్విందర్ కౌర్ తొలిసారి స్పందిస్తూ ‘‘అతడు లొంగిపోయాడని వార్తల్లో చూశాము. అతడు యోధుడిలా లొంగిపోయాడు. అందుకు చాలా గర్వ పడుతున్నాను. ఇక మేము న్యాయపోరాటం ప్రారంభిస్తాం. వీలైనంత తొందరలోనే మేము అతడిని కలుసుకుంటాం’’ అని అన్నారు.

Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్

ఇక అతడి తండ్రి తర్సేమ్ సింగ్ స్పందిస్తూ అమృతపాల్ కొనసాగించిన మిషన్‭ను కొనసాగించమని సంగత్‭ను కోరారు. ‘‘మిషన్‭ను ముందుకు తీసుకెళ్లాలని సంగత్‭ను విజ్ణప్తి చేస్తున్నాను. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు నా కొడుకు యుద్ధం చేస్తున్నాడు. అతడి అరెస్ట్ గురించి టీవీ వార్తల నుంచి మాకు సమాచారం వచ్చింది. అతడు కుటుంబంతో కాంటాక్టులో లేడు. మీడియాలో వస్తున్న ఫొటోలు సరిగా లేవు. అతడు ఈరోజు వరకు కూడా సిక్కు దుస్తులనే ధరిస్తున్నాడు. పంజాబ్ పోలీసుల వేధింపులకు గురైన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నాను’’ అని తర్సేమ్ సింగ్ అన్నారు.

Sudan Fighting: కాల్పుల విరమణ ఒప్పందంపై నిలబడని ఆర్మీ, పారామిలిటరీ.. ఇప్పటి వరకు 400 మంది మృతి, 3,500 మందికి గాయాలు

దాదాపు 37 రోజుల తీవ్ర వేట అనంతరం ఎట్టకేలకు అమృతపాల్ సింగ్‭ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమృతపాల్ సింగ్ లొంగిపోలేదని, పోలీసులు అతడిని చేధించి పట్టుకున్నారని మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పినప్పటికీ.. అరెస్టుకు ముందు అమృతపాల్ సింగ్ విడుదల చేసిన వీడియో చూస్తే అతడే లొంగిపోయినట్లు తెలుస్తోంది. ‘‘నేను పారిపోయేవాడిని కాదు, తిరుగుబాటు దారుడిని. అరెస్టుకు నేను భయపడను. నా గురువు అయిన జర్నైల్ బింద్రన్‭వాలే ఆశీస్సులు తీసుకున్న అనంతరం అరెస్ట్ అవుతాను. నా మద్దతుదారులను హింసిస్తుంటే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు. అందుకే నాకు వేరే దేశం వెళ్లే అవకాశం ఉన్నా కూడా లొంగిపోవడానికే సిద్ధమయ్యాను. గురువుల ఆశిస్సు ఉంది. తొందరలోనే నా సమూహానికి తిరిగి వస్తాను’’ అని వీడియో అమృతపాల్ వీడియో సందేశం ఇచ్చారు.