Amritpal Singh: స్టైలిష్ గాయ్ నుంచి కరుడుగట్టిన ఖలిస్తానీ వరకు.. ఆసక్తిని పెంచే అమృతపాల్ జర్నీ

అమృతపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ హోం మంత్రి అమిత్ షాను బెదిరించారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా అదే చేశారు. మీరన్నట్లే చేస్తే అవే పరిణామాల్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవే మాటలు 'హిందూ రాష్ట్రం' డిమాండ్ చేసే వారిని అమిత్ షా అడగగలరా? అలా అడిగి ఎంతసేపు హోమంత్రి పదవిలో ఉంటారో నేనూ చూస్తాను" అని అన్నారు.

Amritpal Singh: స్టైలిష్ గాయ్ నుంచి కరుడుగట్టిన ఖలిస్తానీ వరకు.. ఆసక్తిని పెంచే అమృతపాల్ జర్నీ

Amritpal Singh's transformation into a radical leader, From Dubai to Ajnala

Amritpal Singh: ఇక లేదనుకున్న ఖలిస్తాన్ ఉద్యమాన్ని మరోసారి పైకి తీసుకువస్తున్నాడా? బింద్రన్‭వాలా2.0 తయారయ్యాడా అని అనేక ప్రశ్నల్ని లేవనెత్తిన వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సాంగ్‭ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తన సహాయకులలో ఒకరిని విడిపించేందుకు గత నెలలో అమృత్‭సర్ నగరంలోని అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌పై వందలాది మంది తన అనుచరులతో కలిసి దాడి చేసిన అనంతరం దేశ వ్యాప్తంగా చర్చలోకి వచ్చాడు. అయితే అదే సమయం నుంచి పోలీసుల రాడార్‌లో ఉన్నాడు. నెల రోజులుగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన అమృతపాల్ సింగ్ ఒకప్పుడు దుబాయ్‌లో నివసించేవాడు. పైగా ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా పంజాబీ సంప్రదాయ జీవనశైలి ఏమీ కాదు. కొంత కాలం క్రితం దీప్ సిద్దూ ప్రారంభించిన వారిస్ పంజాబ్ దేలో చేరేంత వరకు చాలా మోడ్రన్ లుక్కులో, జీవన శైలిలో బతికాడు. వేర్పాటువాద భావజాలం పైకి లేస్తున్నా కొద్ది ఖలిస్తానీ సిద్ధాంతకర్తగా మారారు.

దుబాయ్ నుంచి అజ్నాలా వరకు: అమృతపాల్ సింగ్ ప్రయాణం
అమృతపాల్ సింగ్ (30) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని జల్లుపూర్ గ్రామానికి చెందినవాడు. ఫిబ్రవరి 2022 వరకు దుబాయ్‌లో నివసిసించిన అమృతపాల్ సింగ్.. తన బంధువుల రవాణా వ్యాపారంలో సహాయం చేస్తుండేవాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలోని ఖలిస్తానీ నాయకులలాగా, అమృతపాల్ సనాతన సిక్కు జీవనశైలిని అనుసరించలేదు. అతను తలపాగా ధరించలేదు. ఫ్యాన్సీ హెయిర్ కట్‭లో ఉండేవారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ సమయం గడిపారు.

Manish Kashyap: తమిళనాడులో బిహారీలను హింసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు మనీశ్ కశ్యప్

అయితే ఫిబ్రవరి 15, 2022 తర్వాత అంతా మారిపోయింది. పంజాబీ నటుడు, అప్పటి వారిస్ పంజాబ్ దే చీఫ్ దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించిన రోజది. 2021 జనవరి 26న ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన సందర్భంగా నిషాన్ సాహిబ్‌ని ఆవిష్కరిస్తున్నట్లు చిత్రీకరించిన తర్వాత, అమృతపాల్ సింగ్ మాదిరిగానే దీప్ సిద్ధూ, జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన మరొక నాన్ ప్రాక్టీస్ సిక్కు. పంజాబ్ హక్కుల కోసం పోరాడటానికి దాని సంస్కృతిని రక్షించడానికి అనే ఉద్దేశంలో సామాజిక సంస్థగా వారిస్ పంజాబ్ దేని సెప్టెంబర్ 2021లో ప్రారంభించాడు.

అమృతపాల్ సింగ్ దుబాయ్
ఎప్పుడూ లేని విధంగా అమృతపాల్ సింగ్ పంజాబ్‌లో అడుగుపెట్టాడు. వారిస్ పంజాబ్ దే తదుపరి చీఫ్‌గా ప్రకటించబడ్డాడు. సెప్టెంబర్ 29, 2022న మోగా జిల్లాలోని రోడే గ్రామంలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే గ్రామాన్ని జరిగిన కార్యక్రమంలో అమృతపాల్ సింగ్‌ను అతని మద్దతుదారులు వారిస్ పంజాబ్ దే తదుపరి చీఫ్‌గా నియమించారు. అయితే, దీప్ సిద్ధూ బంధువులు అమృతపాల్ సింగ్‌కు దూరంగా ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం, వేర్పాటువాద ప్రచారం కోసం సంస్థను దుర్వినియోగం చేశారని కూడా ఆరోపించారు.

భింద్రన్‌వాలే లాగా పంజాబ్ సంప్రదాయంలో తనను తాను మార్చుకోవడం
వారిస్ పంజాబ్ దే చీఫ్ పాత్రను స్వీకరించిన తర్వాత, అమృతపాల్ సింగ్ ఆనంద్‌పూర్ సాహిబ్‌లో అమృత్ వేడుకలో (ఖల్సా సంప్రదాయంలోకి దీక్ష) పాల్గొన్నారు. అమృత్‌పాల్ ఖలిస్తానీ సిద్ధాంతకర్త. అతని ప్రేరణ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే వలె దుస్తులు ధరించారు. భింద్రన్‌వాలేను అనుసరిస్తున్నట్లుగానే యువకుల సామూహిక బాప్టిజంను ఖాల్సా వ్యవస్థలోకి నిర్వహించడం ద్వారా వారిస్ పంజాబ్ దే పరిధిని విస్తరించారు. రాడికల్ హిందువులు హిందూ దేశాన్ని డిమాండ్ చేయగలిగితే, సిక్కు దేశాన్ని డిమాండ్ చేయడంలో తప్పు లేదని అమృతపాల్ సింగ్ అనేక ఇంటర్వ్యూలలో ఖలిస్తాన్ ఏర్పాటు డిమాండ్‌ను సమర్థించారు.

అజ్నాలా సంఘటన
ఫిబ్రవరి 24న అమృతపాల్ సింగ్ సహాయకుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయుధాలతో అమృతపాల్ సింగ్ అనుచరులు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. దీంతో అమృతపాల్ సింగ్ ఖ్యాతి గడించారు. కిడ్నాప్ కేసులో నిర్బంధించబడిన అతని సహాయకుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను విడుదల చేయాలంటూ వందలాది మంది బారికేడ్లను ఛేదించి అమృత్‌సర్ నగర శివార్లలోని అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు.

Donald Trump: మంగళవారం నేను అరెస్ట్ అవుతా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్ మరుసటి రోజు విడుదలయ్యారు. అనంతరం మీడియాతో అమృతపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ హోం మంత్రి అమిత్ షాను బెదిరించారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా అదే చేశారు. మీరన్నట్లే చేస్తే అవే పరిణామాల్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవే మాటలు ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్ చేసే వారిని అమిత్ షా అడగగలరా? అలా అడిగి ఎంతసేపు హోమంత్రి పదవిలో ఉంటారో నేనూ చూస్తాను” అని అన్నారు.

Maharashtra: 12వ తరగతి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ పేపర్లూ లీక్‌

అజ్నాలా ఘటన అనంతరం పంజాబ్ ప్రభుత్వంపై పోలీసులపై ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి పెరిగింది. సంఘటన జరిగిన వారం తర్వాత కూడా అమృతపాల్ సింగ్ సహా అతని సహాయకులపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. మార్చి మొదటి వారంలో, పంజాబ్ పోలీసులు చివరకు అమృతపాల్ సింగ్‌పై విరుచుకుపడ్డారు. అతని తొమ్మిది మంది సహాయకుల ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. లైసెన్సులు ఆత్మరక్షణ కోసం ఇవ్వబడ్డాయని, ఖలిస్తానీ నాయకుడికి భద్రత కల్పించడానికి కాదని వారు పేర్కొన్నారు.

Amit Shah: ఎట్టకేలకు అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా

ఇక మార్చి 18న, పోలీసులు సుమారు 100 వాహనాలతో సుదీర్ఘ సమయం వెంబడించి ఎట్టకేలకు అమృతపాల్ సింగ్ ఆరుగురు సహాయకులను జలంధర్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం అమృతపాల్ సింగ్‌ను జలంధర్‌లోని నకోదర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృతపాల్ నిర్బంధానికి సంబంధించిన నివేదికలను పంజాబ్ పోలీసులు ధృవీకరించలేదు. ప్రస్తుతం పంజాబ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు రద్దు చేశారు.