ఫేస్‌బుక్‌లో చైల్డ్ పోర్న్ వీడియోలు, పోలీసుల అదుపులో నిందితులు

ఫేస్‌బుక్‌లో చైల్డ్ పోర్న్ వీడియోలు, పోలీసుల అదుపులో నిందితులు

child porn video on social media: కఠిన చట్టాలు తెస్తున్నా, శిక్షలు వేస్తున్నా కొంతమంది వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. చట్టాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కటకటాల పాలవుతున్నారు. తాజాగా, చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అమృతసర్ కు చెందిన ఓ వ్యక్తిని పంజాబ్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిందితుడి తమ్ముడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

సోదరులైన ఇద్దరు నిందితులు చైల్డ్ పోర్న్ వీడియోలను తన మెసేజింగ్ ప్లాట్‌ఫాం మెసెంజర్ ద్వారా పంచుకుంటున్నారని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు (ఎంహెచ్‌ఏ) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని కేంద్రహోం మంత్రిత్వ శాఖ పంజాబ్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆదేశించింది.

రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పిల్లల అశ్లీలతకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలను అమృతసర్ కు చెందిన ఇద్దరు సోదరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. వారిని కరణ్, లోవిష్ గా గుర్తించారు. కరణ్ అమృతసర్ లో మొబైల్ రిపేర్ షాపు నడుపుతున్నాడు. తన తమ్ముడు లోవిష్ తో కలిసి పిల్లల అశ్లీల వీడియోలను కరణ్ సోషల్ మీడియాలో పెడుతున్నాడని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు లోవిష్ పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.