Amruta Fadnavis: డిజైనర్‌పై అమృత ఫడ్నవిస్ కేసు.. కోటి లంచం ఇవ్వాలనుకుందంటూ ఫిర్యాదు
తన డిజైనర్ తనను బెదిరించిందని, రూ.కోటి లంచం ఇవ్వజూపిందని అమృత ఫడ్నవిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు వివరాల ప్రకారం.. అనిక్షా అనే మహిళ అమృత ఫడ్నవిస్‌ను 2021 నవంబర్‌లో తొలిసారి కలిసింది.

Amruta Fadnavis: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన డిజైనర్ తనను బెదిరించిందని, రూ.కోటి లంచం ఇవ్వజూపిందని అమృత ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఈ కేసు వివరాల ప్రకారం.. అనిక్షా అనే మహిళ అమృత ఫడ్నవిస్‌ను 2021 నవంబర్‌లో తొలిసారి కలిసింది. తాను డిజైనర్ అని, దుస్తులు, నగలు, పాదరక్షలు డిజైన్ చేస్తానని అనిక్ష చెప్పింది. అమృత హాజరయ్యే ఈవెంట్స్‌లో తను డిజైన్ చేసిన దుస్తులు ధరించాలని, దీనివల్ల తనకు పబ్లిసిటీ వచ్చి, తన మార్కెటింగ్ పెరుగుతుందని ఆమె చెప్పింది. తనకు తల్లి లేదని, తండ్రి ఇబ్బందుల్లో ఉన్నాడని వివరించింది. ఇది నమ్మిన అమృత ఆమెపై జాలిపడి దీనికి అంగీకరించింది. కొంతకాలం తర్వాత తన తండ్రిపై కొన్ని ఫేక్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి తన తండ్రిని తప్పించడంలో సాయపడాలని కోరింది.
అంతేకాదు.. తనకు కొందరు బుకీలు తెలుసని, వారి ద్వారా డబ్బు సంపాదించవచ్చని కూడా అనిక్ష చెప్పింది. కానీ, దీనికి అమృత నిరాకరించింది. ఆ తర్వాత అనిక్ష మళ్లీ అమృతను కలిసింది. తన తండ్రిని రక్షించాలని కోరింది. దీని కోసం రూ.కోటి లంచం ఇచ్చేందుకు సిద్ధపడింది. అనిక్ష గురించి తెలుసుకున్న అమృత తన నెంబర్ బ్లాక్ చేసింది. తర్వాత వేరే నెంబర్ల నుంచి అమృతకు అనిక్ష కొన్ని మెసేజ్‌లు, వీడియోలు పంపింది. తను చెప్పినట్లు చేయకపోతే, తన భర్త, దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించింది.
ఈ విషయాన్ని అమృత తన భర్తకు చెప్పింది. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్ సలహా మేరకు అమృత ఫడ్నవిస్ ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనిక్షతోపాటు, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఫిబ్రవరి 20న ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ తనపై రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. ఈ అంశంపై నిష్పాక్షిక విచారణ జరుగుతుందని చెప్పారు.