Amul, Mother Dairy Milk Prices Rise: పాల రేట్లు పెంచిన అమూల్, మదర్ డైయిరీ.. రేపటి నుంచి అమల్లోకి కొత్త ధరలు

సామాన్యులకు మరోషాక్ తగలనుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్, ఇంధన ధరలకు తోడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో జీవనం కష్టంగా మారిన సామాన్యులపై పాల ఉత్పత్తి కంపెనీలు మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి.

Amul, Mother Dairy Milk Prices Rise: పాల రేట్లు పెంచిన అమూల్, మదర్ డైయిరీ.. రేపటి నుంచి అమల్లోకి కొత్త ధరలు

Milk Prices

Amul, Mother Dairy Milk Prices Rise: సామాన్యులకు మరోషాక్ తగలనుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్, ఇంధన ధరలకు తోడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో జీవనం కష్టంగా మారిన సామాన్యులపై పాల ఉత్పత్తి కంపెనీలు మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ప్రముఖ పాల బ్రాండ్‌లు అమూల్, మదర్ డెయిరీలు తమ పాల ప్యాకెట్ ధరలను పెంచాయి. లీటర్ మీద రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు రేపటి (బుధవారం) నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి.

Cardamom Milk : గుండె ఆరోగ్యానికి, నిద్రలేమి సమస్యకు రోజుకు ఒక్క గ్లాసు యాలకుల పాలు చాలు!

పాల సేకరణ, ఇతర ఇన్ ఫుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. 500 ఎంఎల్ అమూల్ గోల్డ్  ప్యాకెట్ రూ.31, అమూల్ తాజా రూ. 25, అమూల్ శక్తి రూ. 28 చొప్పున విక్రయిస్తున్నారు.  అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్‌లలో అమూల్ డెయిరీ బ్రాండ్ యొక్క మాతృ సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఈ విషయాన్ని తెలిపింది. పెరిగిన పాల ధరలు గుజరాత్ లోని సౌరాష్ట్ర, ఢిల్లీ ఎన్ సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబయితో పాటు అమూల్ మార్కెటింగ్ చేసే ప్రతి చోటా వర్తిస్తాయని తెలిపింది.  అదేవిధంగా మదర్ డెయిరీ తన అన్ని పాల రకాలకు దాని ధర సవరణ వర్తిస్తుందని తెలిపింది. ఫుల్ క్రీమ్ మిల్క్ ఇప్పుడు లీటరుకు రూ. 61, టోన్డ్ మిల్క్ రూ. 51, డబుల్ టోన్డ్ రూ.45. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) రూ.48 వరకు పెరగనున్నాయి.

గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్ ఫుట్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ధరల పెంపు తప్పడం లేదని మదర్ డెయిరీకి చెందిన ఓ అధికారి ఓ జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు.  అయితే పెరిగిన ధరలు ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంలో అమల్లోకి రానున్నాయి.  కంపెనీ చివరిసారిగా మార్చిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది.