Viral Video: రూ.500 విత్‌డ్రా చేస్తే ఎంత వచ్చాయో చూడండి.. ఏటీఎం వద్దకు జనం పరుగులు.. పోలీసులు మాత్రం..

ఏటీఎ వద్దకు ఓ వ్యక్తి వెళ్లాడు.. రూ.500 విత్ డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించాడు.. దీంతో మిషన్ నుంచి బయటకు వచ్చిన నోట్లను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.. పక్కనే ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని బయటఉన్న వ్యక్తికి తెలియజేయడంతో విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంకేముంది.. జేబులో ఏటీఎం కార్డుఉన్న ప్రతీఒక్కరు ఒక్కసారిగా ఏటీఎం వద్దకు పరుగులు పెట్టారు.

Viral Video: రూ.500 విత్‌డ్రా చేస్తే ఎంత వచ్చాయో చూడండి.. ఏటీఎం వద్దకు జనం పరుగులు.. పోలీసులు మాత్రం..

Video

Viral Video: ఏటీఎ వద్దకు ఓ వ్యక్తి వెళ్లాడు.. రూ.500 విత్ డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించాడు.. దీంతో మిషన్ నుంచి బయటకు వచ్చిన నోట్లను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.. పక్కనే ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని బయటఉన్న వ్యక్తికి తెలియజేయడంతో విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంకేముంది.. జేబులో ఏటీఎం కార్డుఉన్న ప్రతీఒక్కరు ఒక్కసారిగా ఏటీఎం వద్దకు పరుగులు పెట్టారు. ఏటీఎం ఉన్న ప్రాంతమంతా జనంతో రద్దీగా మారింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని ఏటీఎంను మూసేసి బ్యాంక్ సిబ్బంది తెలియజేశారు. వారు వచ్చి ఇలాఎలా జరిగిందా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నాగపూర్ జిల్లా ఖాపరేఖేడ్ పట్టణంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఓ వ్యక్తి ఈ ఏటీఎంలోకి వెళ్లి రూ. 500 విత్ డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించడంతో రూ. 2500 (ఐదు రూ.500 నోట్లు) వచ్చాయి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన వ్యక్తి అదే తరహాలో మరో రూ. 500 విత్ డ్రా చేయగా మళ్లీ రూ. 2500 వచ్చాయి. ఈ విషయాన్ని నగదు విత్ డ్రా చేసుకొనేందుకు వచ్చిన మరో వ్యక్తి గమనించి పక్కనే ఉన్న వ్యక్తికి చెప్పడంతో ఆ వార్త స్థానికంగా దావానంలా వ్యాపించింది. ఇకేముంది.. జేబులో ఏటీఎం కార్డు ఉన్న ప్రతిఒక్కరూ అక్కడికి వాలిపోయి.. ఏటీఎంలో నగదు తీసుకొనేందుకు పోటీపడ్డారు. ఈ విషయాన్ని స్థానికుల్లో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలికి వచ్చి చూసేసరికి జనం గుమ్మిగూడి ఉండటంతో వారిని అక్కడి నుంచి పంపించివేసి ఏటీఎం సెటర్ క్లోజ్ చేశారు.

Viral Video: పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఏనుగు.. వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా.. ప్రీతి జింటా ఏమందంటే..

ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేయడంతో.. హుటాహుటీన అక్కడికి చేరుకున్న బ్యాంక్ సిబ్బంది.. ఇలా ఎలా జరిగిందా అని తనిఖీ చేశారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. రూ.100 విలువైన నోట్లను ఉంచాల్సిన ట్రేలో రూ.500 నోట్లు తప్పుగా ఉంచడంతో ఇలా జరిగిందని గుర్తించారు. ఇక ఏటీఎంలో ఎంత సొమ్ము ఉంచాం.. ఇప్పుడు ఎంత ఉంది.. ఎంత నగదు ఎక్కువగా విత్ డ్రా అయ్యింది అనే విషయాలపై ఆరాతీసే పనిలో పడ్డారు. మరోవైపు పోలీసులు ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసే పనిలో పడ్డారు. ఎవరు ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేశారో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.