Earthquake : మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు

మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.

Earthquake : మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు

earthquake

earthquake : మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.

భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.  అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.

Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ పట్టణంలో కూడా భూకంపం వచ్చింది. ఉదయం 7.13 గంటలకు 3.4 నిమిషాలపాటు భూమి కంపించింది. అదే రోజు మధ్యప్రదేశ్ లోని ధార్ లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చింది.